Home /News /trending /

VIDEO OF A HERON GOING VIRAL AFTER ATTENDING AN OLD MAN FUNERAL IN RAJASTHAN SNR

వృద్దుడి అంత్యక్రియల్లో కన్నీరు కార్చిన కొంగ..ఏంటీ విడ్డూరం

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Rajasthan: ఎవరైనా చనిపోతే బంధువులే దూరంగా ఉండే ఈరోజుల్లో నోరులేని ఓ పక్షి తన మూగప్రేమను చాటుకుంది. రోజూ ఆహారం, నీళ్లు పెట్టాడన్న విశ్వాసంతో పక్షిప్రేమికుడి అంత్యక్రియలకు హాజరై తన సానుభూతిని తెలియజేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఇంకా చదవండి ...
ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు(Funeral)ముగిసే వరకూ కుటుంబ సభ్యులే స్మశానంలో శవం దగ్గర ఉండరు. కానీ రాజస్థాన్‌(Rajasthan)లో ఓ 80సంవత్సరాల (80years) వృద్ధుడు (Old man)చనిపోతే ..ఓ పక్షి (Heron)తన విచారాన్ని వ్యక్తం చేసింది. నోరు లేదు కదా ఎలా చెప్పిందని ఆశ్చర్యపోకండి. నోరు లేదు కాబట్టే తన ప్రవర్తనతో ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజస్థాన్‌ అల్వార్‌ (Alwar) జిల్లాలోని రాయిని(Raini)ప్రాంతానికి సమీపంలో ఉన్న బగద్‌పూరా- ముకద్‌పూరా (Bagadpur -Mukadpura) గ్రామంలో మోతిలాల్‌ మీనా (Motilal meena)అనే వృద్ధుడు చనిపోయాడు. అతను చనిపోయిన వార్త తెలుసుకున్న ఓ కొంగ నేరుగా వృద్ధుడి ఇంటి దగ్గరకు వచ్చి వాలింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం (Dead body)దగ్గర కాపాలా ఉండిపోయింది. మోతిలాల్‌ మీనా బంధువులు ఏడుస్తుంటే వారి చుట్టూ తిరిగి ఓదార్చే ప్రయత్నం చేసింది. కొంగ ఏమిటి..చనిపోయిన శవం దగ్గర కాపలా కాయడం ఏమిటని మోతీలాల్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగకుండా..మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేసేందుకు శవ పేటిక అమర్చుతుంటే దానిపై వాలింది కొంగ. అక్కడి నుంచి స్మశాన వాటికి కూడా వెళ్లి మోతిలాల్‌ మీనా చితి పూర్తిగా కాలిపోయే వరకూ అక్కడే ఉంది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సైతం కొంగ ప్రవర్తించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కొంగ ఏం చేస్తుందో చూద్దామని ఓ వ్యక్తి దాని తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media)పోస్ట్ చేయడంతో వైరల్‌(Video viral)అవుతోంది.

ఓ పక్షి మూగప్రేమ..
మృతుడు మోతిలాల్‌ మీనాకు పక్షులు, వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం. రోజు వాటి కోసమే ఎక్కువ సమయం కేటాయించే వాడు. పక్షులు, జంతువులకు కావాల్సిన నీళ్లు, ఆహారం పెట్టేవాడని బంధువులు తెలిపారు. పక్షులపై ఆ వృద్ధుడు చూపించిన ప్రేమను మర్చిపోలేకే కొంగ మోతిలాల్‌ మీనా అంత్యక్రియలకు హాజరైందని గ్రామంలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

విశ్వాసం చూపించిన కొంగ..
ప్రతిరోజు క్రమం తప్పకుండా మృతుడు మోతిలాల్‌ మీనా పక్షులు, కొంగలకు ఆహారం పెట్టేవాడని..అతను చనిపోవడంతో ఆహారం దొరక్కపోవడంతో అతడ్ని వెదుక్కుంటూ కొంగ ఇంటికి వచ్చిందని మరికొందరు గ్రామస్తులు తెలిపారు. ఎవరేమనుకున్న తిన్న విశ్వాసంతోనో..తిండి కోసమే ఓ కొంగ ప్రాణం పోయిన వ్యక్తికి నివాళులర్పిస్తూ చనిపోయిన దగ్గర నుంచి అంత్యక్రియలు ముగిసే వరకూ వెంట ఉండటం చాలా గొప్ప విషయమని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
Published by:Siva Nanduri
First published:

Tags: Birds, Dead body, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు