హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: 4కాళ్లు, 4చేతులున్న అమ్మాయి..వీడియో ఇదిగో

OMG: 4కాళ్లు, 4చేతులున్న అమ్మాయి..వీడియో ఇదిగో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

OMG:బీహార్‌లో చిన్నారి వింత సమస్యతో బాధపడుతోంది. అందరికి ఉన్నట్లే రెండు చేతులు, రెండు కాళ్లు కాకుండా ఆమెకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టింది. అదనంగా ఉన్న రెండు చేతులు, కాళ్లు పొట్టభాగంలో ఉండటంతో వైద్యం కోసం తల్లిదండ్రులు చెప్పులు అరిగేలా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇంకా చదవండి ...

పుట్టిన ప్రతి మనిషికి రెండు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. కాని బీహార్‌(Bihar)కి చెందిన ఓ చిన్నారికి నాలుగు కాళ్లు(Four legs), నాలుగు చేతులు(Four arms)ఉన్నాయి. సుమారు మూడు సంవత్సరాల(3Years old girl) వయసు కలిగిన ఈ చిన్నారి సాధారణ అవయవాల కంటే మరో రెండు అదనంగా కలిగి ఉండటంతో ఆమెను వింతగా చూస్తున్నారు జనం. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ...అదనంగా ఉన్న రెండేసి చేతులు, కాళ్లు ఉండాల్సిన శరీర భాగంలో కాకుండా..పొట్ట భాగం నుంచి బయటకు రావడంతో మరింత ఆశ్చర్యపోతున్నారు. ఈ బాలికను చూసిన రాజేశ్‌కుమార్‌శ్రీ (Rajesh Kumar Sri)అనే సామాజిక కార్యకర్త వీడియో(Video) తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో చిన్నారి పాప ఇప్పుడు అందరి కళ్లలో పడింది.

ఆ చిన్నారికి 4చేతులు, 4కాళ్లు..

బీహార్ రాష్ట్రం నవాడా నగరంలోని కచారి రోడ్డులో ఓ చిన్న పాప బిస్కెట్‌ ప్యాకెట్ తింటూ నిలబడింది. రోడ్డుపై వెళ్తున్న వాళ్లు, స్థానికులు ఆమెనే తదేకంగా చూస్తున్నారు. పసిపాప నాలుగు చేతులు, నాలుగు కాళ్లు కలిగి ఉండటంతో ఈ విచిత్రమైన బాలికను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గూమికూడారు. వింత శరీర భాగాలతో పుట్టిన బాలికను సెల్‌ఫోన్‌లు తీసి ఫోటోలు తీసుకున్నారు. వికలాంగురాలిగా ఉన్న బాలిక స్వస్తలం వార్సాలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హేమ్దా గ్రామం. పుట్టుకతోనే అదనంగా కాళ్లు, చేతులతో పుట్టిందని పసిపాప తల్లిదండ్రులు తెలిపారు. తండ్రి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.


వింత బాలిక వీడియో వైరల్..

వింత అవయవాలతో పుట్టిన బిడ్డకు వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోవడంతో..ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు తల్లిదండ్రులు. అందులో భాగంగానే బాలికకు వైద్యం కోసం పావాపురిలోని విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు కూడా చిన్నారికి వైద్యం చేయడానికి అనుకూలమైన వైద్యపరిజ్ఞానం అందుబాటులో లేదని తేల్చి చెప్పారు. వేరే గత్యంతరం లేకపోవడంతో అలాగే బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దగ్గరకు వచ్చారు. ఆ సమయంలోనే అందరూ బాలిక వింతగా నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉండటాన్ని గమనించారు.వెంటనే తమ బిడ్డను తీసుకొని నవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు.

తల్లిదండ్రుల ఆవేదన..

వింత ఆకారంలో పుట్టిన చిన్నారిని చూసిన స్థానికులు ఫోటోలు తీసుకున్నారు. అందులో కొందరు జాలిపడి తమకు తోచిన ఆర్ధిక సహాయం చేశారు.బిడ్డ దీనస్థితిని చూసి జనం సాయం చేస్తుంటే నిస్సహాయస్థితిలో ఉన్న తల్లిదండ్రులు చూసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగడం కంటే జిల్లా కలెక్టర్‌ని కలిసి మీ పరిస్థితి చెప్పండి ప్రయోజనం ఉంటుందని సలహా ఇచ్చారు.

First published:

Tags: Bihar News, Viral Videos

ఉత్తమ కథలు