Viral Video: స్టేజ్‌పై ఈ చిన్నారి చేసిన పనికి నవ్వులే నవ్వులు.. మీరూ చూడండి..

Photo Credit : YouTube

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ ఫాంలో ఉన్నారు. ఏదైనా ఫన్నీ వీడియో కన్పిస్తే చాలు దాన్ని ట్రెండింగ్ చేసేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ చిన్నారి అమాయకపు పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Share this:
చిన్న‌పిల్ల‌లు అమాయ‌క‌త్వంతో చేసే ప‌నులకు ఎవ్వ‌రికైనా న‌వ్వొస్తుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ వాళ్ల అమాయ‌క‌త్వానికి `పాపం` అనిపించి, జాలేస్తుంది. అలాగే ఈ సంఘ‌ట‌న‌లోనూ ఒక చిన్నారి అమాయ‌క‌త్వానికి వీడియో చూసిన వాళ్లంతా నవ్వుకుంటూ లైక్స్, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ చిన్నారి వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. వైర‌ల్ అయిన ఈ వీడియోలో ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఒక పాప డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతున్న స్టేజ్‌పై క‌ళ్లు మూసుకొని, కూర్చొని ఉంటుంది. స్టేజ్ పైనున్న మిగిలిన చిన్నారులంతా వాళ్ల వాళ్ల డాన్స్ మూమెంట్‌లు చేస్తూనే ఉంటారు. ఈ చిన్నారితో పాటు డాన్స్ పార్ట‌న‌ర్ త‌న మూమెంట్ పూర్త‌యిన త‌ర్వాత ఈ పాప‌ను లేప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అయినా ఆమె లేగ‌వ‌కుండా, హాయిగా త‌న నిద్ర‌లోనే మునిగిపోయి ఉంటుంది. ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను చూడ‌టానికి వ‌చ్చిన ఆడియ‌న్స్ అంతా ఎంతో అమాయ‌కంగా నిద్ర‌పోతున్న ఈ పాపను చూసి ముచ్చ‌ట‌ప‌డ్డారు. పాపం ఎంత‌గా అల‌సిపోయి ఉంటుందోన‌ని అనుకున్నారు. తూర్పు చైనా లోని ఝేజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్ఝౌవ్ న‌గ‌రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన చిన్న వీడియో సామాజిక మాధ్య‌ల్లో వైర‌ల్‌గా మారింది.

పాప త‌ల్లి చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం, సాధార‌ణంగా ఈ చిన్నారికి లంచ్ స‌మ‌యంలో కొంచెం సేపు నిద్ర‌పోయే అలవాటు ఉంది. అయితే ఆ రోజు ఈ డాన్స్ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా మ‌ధ్యాహ్నం నిద్ర‌పోలేదు. ప్రోగ్రామ్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయ‌డం వ‌ల్ల నిద్ర‌పోయే స‌మ‌యం దొర‌క‌లేదు. అందుకే అల‌సిపోయిన చిన్నారి, స్టేజ్ పైనే నిద్ర‌పోయిందని చైనా మీడియా తెలియ‌జేసింది. మ‌రో విష‌యం ఏమంటే, డాన్స్ ప్రోగ్రామ్ అయిన‌పోయిన త‌ర్వాత కూడా ఈ పాప స్టేజ్‌పైనే ఉంది. నిద్ర నుంచి లేవ‌డం ఏమాత్రం ఇష్టం లేక‌పోవ‌డంతో ఎవ‌రూ లేపినా లేవ‌కుండా హాయిగా ఒక కునుకు తీసింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఈ వీడియోను యూట్యూబ్ లో 3.2 ల‌క్ష‌ల‌మందికి పైగా చూశారు. చూడ‌గానే ఎంతో ముచ్చ‌టేసే ఈ వీడియో గురించి నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను పంచుకోకుండా ఉండ‌లేక‌పోయారు. ఈ వీడియో గురించి కామెంట్ చేస్తూ ఒక యూజ‌ర్ `ఈ పాప అంత సేపూ ఒకే పొజీష‌న్‌లో కూర్చొని నిద్ర‌పోవ‌డం కూడా చాలా ఇంప్రెసీవ్‌గా ఉంది‌` అని. మ‌రో వ్య‌క్తి...`ఇది నేనే. ప‌నిచేసేట‌ప్పుడు ఇలాగే ఉంటాను` అని న‌వ్వే ఎమోజీలతో కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి టైటిల్ పెట్టే ప్ర‌య‌త్నం చేసిన కొంద‌రు ఫ‌న్నీగా స్పందించారు. `లిటిల్ గర్ల్! ఇందులో నా పాత్ర స్లీపింగ్ బ్యూటీ (Sleeping Beauty)` అని ఒక‌రంటే, `గార్ల్ డాన్సింగ్: దీని కోస‌మే నేను ఇంత క‌ష్ట‌ప‌డ్డాను!` అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. ఇక ఇంకొక యూజ‌ర్ కామెంట్ చేస్తూ, `నిజానికి, ఆ హాల్‌లో ఉన్న ప్రేక్ష‌కులు చూపుల‌న్నీ నిద్ర‌పోతున్న ఈ చిన్నారి పైనే ఉంటాయి` అని మురిసిపోయారు. ఇంత‌కీ ముచ్చ‌ట‌గా అనిపించే ఈ వీడియో చూసిన త‌ర్వాత మీకు ఏమ‌నిపిస్తోంది?
Published by:Sridhar Reddy
First published: