VIDEO OF A BRIDE SLAPPING HER GROOM ON A WEDDING PARTY IN HIMACHAL PRADESH HAS GONE VIRAL SNR
Video Viral: పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మండపంలోనే చెప్పుతో కొట్టింది..ఎందుకో ఈ వీడియో చూడండి
Photo Credit:Youtube
Viral Video: హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లికూతురు చూపించిన ఆగ్రహానికి పెళ్లి కొడుకు చెంప చెళ్లుమంది. పెళ్లి మండపంలోనే అందరూ చూస్తుండగా మెడలో పూల దండ వేయగానే చెప్పుతో చెంప పగలగొట్టింది. ఈవీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
నిన్న, మొన్నటి వరకు పెళ్లి వేడుకల్లో ఎన్నో సరదాలు, సంతోషపడే సన్నివేశాలు కనిపించేవి. నూతన వధువరుల ఊరేగింపు దగ్గర నుంచి పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వరకు ఏదో తీపి గుర్తులకు సంబంధించిన వీడియోలు ఉండేవి. కాని ఈమధ్య కాలంలో ఏ పెళ్లి వేడుకల్లో చూసిన పెళ్లికూతురు పెళ్లికొడుకుని కొట్టడం, లేదంటే కట్నం కోసం అబ్బాయి అలగడం, ఇవీ కాకుండా పెళ్లి కూతురు పెళ్లి పీటలపై నుంచి లేచి వేరే అబ్బాయితో వెళ్లిపోవడం వంటి వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh) హమీర్పూర్ (Hamirpur)లో ఓ జంట పెళ్లి మండపంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు(Bride) ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లికొడకు అమ్మాయి మెడలో పూల దండం వేశాడో లేదో చెంప చెళ్లు(Slapping)మనిపించింది. అంతటితో ఆగకుండా..చెప్పు తీసుకొని చెంపపై చెడా, మాడ కొట్టేసింది. అప్పటి వరకు పెళ్లి కొడుకు(Groom)ఫ్రెండ్స్, బంధు, మిత్రులు, పెళ్లికి వచ్చిన వారితో సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా పెళ్లి కూతురు రియాక్షన్‌తో సైలెంట్‌గా మారిపోయింది.
పెళ్లి కొడుకు చెంప చెళ్లు మనిపించింది..
పెళ్లి మండపంలో నూతన వరుడ్ని పెళ్లి కూతురు చెప్పుతో, చెత్తో కొట్టడం స్థానికంగా దుమారం రేపింది. పెళ్లి వీడియో తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లతో పాటు మరికొందరు అమ్మాయి కొడుతున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూలదండల మార్పిడి సమయంలో పెళ్లి కూతురు ఇచ్చిన రియాక్షన్‌కి అక్కడికి వచ్చిన వాళ్ల నోళ్లు మూసుకుపోయాయి. అందరూ షాక్‌లో ఉండగానే పెళ్లి మండపం నుంచి దిగి వెళ్లిపోయింది. అయితే పెళ్లి కూతురు అబ్బాయి పట్ల ఎందుకు అంత సీరియస్ అయిందనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కట్న, కానుకల విషయంలో వరుడు తరపున ఏమైనా గట్టిగా అడగటం వల్లే ఈ సీన్ జరిగి ఉండవచ్చని వీడియో చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పెళ్లి కూతురికి వరుడు నచ్చలేదేమో అందుకే నువ్వు నాకు వద్దు అనే విషయాన్ని ఇంత స్ట్రాంగ్‌గా చెప్పిందని మరికొందరు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
పెళ్లి కూతురు హర్ట్ అయిందట..
పెళ్లి కూతురు తరపు బంధువులు మర్యాదలు సరిగా చేయలేదనే విషయంపై అబ్బాయి తరపు బంధువులు అలిగినట్లుగా సమాచారం. ఈవిషయంపైనే బంధు,మిత్రులు సర్దిచెప్పి వివాహం వరకు తీసుకొచ్చారు. అయితే పెళ్లి వేడుకల్లో మరోసారి అదే టాపిక్ రిపీట్ కావడం వల్లే నూతన వధువు అంత సీరియస్‌గా రియాక్ట్ అయిందని అక్కడికి వచ్చిన వాళ్లు చెప్పుకున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.