Video: గిన్నీస్ ఎక్కిన వీడియో గేమ్. దానికోసం 52 ప్రొజెక్టర్ల వాడకం

Video: గిన్నీస్ ఎక్కిన వీడియో గేమ్. (image credit - youtube)

Viral Video: ఒక్క ప్రొజెక్టర్‌తో ఓ సినిమా ప్లే చెయ్యవచ్చు. అలాంటిది ఆ వీడియో గేమ్ కోసం ఏకంగా 52 ప్రొజెక్టర్లు వాడారంటే... అది ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆ థ్రిల్లింగ్ వీడియో చూద్దాం.

  • Share this:
    Video: ఆగస్ట్ 19న ఓ అద్భుతం జరిగింది. లాస్ వెగాస్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది. అతి పెద్ద వీడియో గేమ్ డిస్‌ప్లే పేరుతో ఓ ప్రొజెక్షన్ వేశారు. గెరెనా ఫ్రీ ఫైర్ (Garena Free Fire) అనే వీడియో గేమ్ తయారుచేసిన వారు... దాన్ని ప్రదర్శించేందుకు సరైన ప్లేస్ ఏది అని చూశారు. లాస్ వెగాస్‌లోని ట్రోపికానా హోటల్‌కి చెందిన క్లబ్ టవర్‌పై ఈ గేమ్‌ని ప్రొజెక్టర్ల సాయంతో ప్రదర్శించారు. ఈ గేమ్ ప్రారంభించి 4 సంవత్సర వార్షికోస్తవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈసారి ప్రొడెక్టర్ 46,733 చదరపు అడుగులు ఉంది. ఇది 2020 డిసెంబర్‌లో ఎక్స్ బాక్స్ అండ్ డెస్టినీ 2: బియోండ్ లైట్ కోసం ప్రదర్శించిన 19,090 చదరపు అడుగుల ప్రొజెక్టర్ కంటే ఇది రెట్టింపు పెద్దది.

    ఇంత పెద్ద డిస్‌ప్లే రావడం కోసం ఏకంగా 52 ప్రొజెక్టర్లు, 10 మీడియా సర్వర్లను ఉపయోగించారు. ఫలితంగా డిస్‌ప్లేకి 16 లక్షల ల్యూమెన్స్ కాంతి వచ్చింది. ఫలితంగా కొత్త రికార్డ్ నమోదైంది. ప్రొజెక్టర్ ద్వారా వచ్చిన అత్యధిక ల్యూమెన్ల కాంతిగా రికార్డ్ నమోదైంది.

    ఆ డిస్‌ప్లే వీడియోని ఇక్కడ చూడండి:

    ఈ డిస్‌ప్లేను లాస్ వెగాస్ మ్యూజీషియన్స్ పెర్కస్సియా పెర్ఫార్మ్ చేసింది. గెరెనా ఫ్రీ ఫైర్ అనేది ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్. దీన్ని గెరెనా పబ్లిష్ చేసింది. ఒకేసారి ఎక్కువ మంది దీన్ని ఆడగలరు. 2019లో ఈ గేమ్‌ను 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2020లో దీనికి 8 కోట్ల మందికి పైగా డైలీ యూజర్లు ఉన్నారు.

    ఇదివరకు రికార్డ్ చూస్తే... నవంబర్ 2020లో అతిపెద్ద గేమ్ ప్రొజెక్షన్ రికార్డ్ నమోదైంది. అమెరికాకు చెందిన పెయింట్‌స్కాపింగ్... కొలరాడోలోని 1,774 చదరపు మీటర్ల కాపర్ మౌంటౌన్‌పై ఎక్స్ బాక్స్ కోసం ప్రదర్శించింది.

    ఇది కూడా చదవండి: Pics: జాలరి వలకి చిక్కిన 800 కేజీల వింత చేప.. అరుస్తూ, భయపెడుతూ ఏం చేసిందంటే!

    తాజా వీడియో వైరల్ అయ్యింది. దీన్ని వారం లోపే 1.45 లక్షల మంది చూశారు. చాలా మంది ఈ వీడియో బాగుందని మెచ్చుకుంటున్నారు. కొంత మంది ఈ గేమ్ కొనుక్కుంటున్నారు. ఓ యూజర్ ఇలా అన్నారు. "మీరు 4 వారాల్లో 100 ప్లేయర్లను చంపగలిగితే... మీకు ఫ్రీ ఫైర్... 1000 డైమండ్స్ ఇస్తుంది" అని చెప్పారు. "ఈ గేమ్ నాకు బాగా నచ్చింది. కానీ నేను టాపప్ పొందలేను. నాకు గెరెనా సాయం చెయ్యాలి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
    Published by:Krishna Kumar N
    First published: