Viral Video : సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా(Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ (Viral) అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ, కొందరు చేసే తిక్క పనులు కూడా పెళ్లి మీద వారికున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయ్. ముఖ్యంగా ఇప్పుడు చూడబోయే వైరల్ వీడియోలో వరుడు చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
సాధారణంగా ఎవరి జీవితంలోనైనా సరే పెళ్లి చాలా కీలకం. అలాంటిది కొందరు ఆ వివాహాన్నే సిల్లీగా తీసుకుంటున్నారు. కొందరు వెరైటీ కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. కొంతమంది.. తమ పెళ్లిళ్లకే ఆలస్యంగా వెళ్లి అభాసుపాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన పెళ్లికి ఫుల్గా తాగి వెళ్లాడు. ఎంతగా అంటే మండపంపై తూగేంతగా తాగాడు. ఆ మైకంలో పెళ్లి కూతురుగా మెడలో కాకుండా.. పక్కనున్న మరో పెళ్లి కూతురు చెల్లి అంటే మరదలు మెడలో దండ వేసేశాడు. ఇంకేముంది అక్కడున్న వారందరూ షాక్ కు గురయ్యారు.
వరుడే మద్యం సేవించి.. తన పెళ్లికి వెళ్లాడు. పెళ్లి మండపంలో కనీసం నిటారుగా నిలబడలేనంతగా తాగాడు. దీంతో అతనికి ఇంకో వ్యక్తి సహాయం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అలా తూగుతున్న పెళ్లికొడుకు మెడలో పెళ్లి కూతురు దండ వేసింది. తర్వాత వరుడు దండ వేయాల్సి ఉండగా.. తూగుతూ వధువు మెడలో కాకుండా పక్కనున్న మరదలు మెడలో వేసేశాడు. దాంతో వధువు షాక్ అయింది. అయినా ఆయన మత్తు వీడలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోను ‘bridal_lehenga_designn’ అనే ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేయగానే కొద్ది క్షణాల్లో వేలలో వ్యూస్ వచ్చాయ్. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది వరుణ్ని తిట్టిపోస్తున్నారు. బాబు.. అది నీ పెళ్లి రా.. నీ వివాహానికే తాగి వస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. ఇలాంటి వాళ్లకి పెళ్లంటే ఆటగా మారిపోయిందని.. వేస్టుగాడిలా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వరుడి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.