హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: కొమ్ములతో పెద్దాయనను విసిరేసిన దున్నపోతు.. షాకింగ్ వీడియో వైరల్ ..

OMG: కొమ్ములతో పెద్దాయనను విసిరేసిన దున్నపోతు.. షాకింగ్ వీడియో వైరల్ ..

పెద్దాయనపై దాడి చేస్తున్న దున్నపోతు

పెద్దాయనపై దాడి చేస్తున్న దున్నపోతు

Viral video: రోడ్డుమీద నలుపు రంగు దున్నపోతు వస్తుంది. ఇంతలో దాని ముందు ఒక పెద్దాయన నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. మనలో చాలా మంది పశువులను దేవతల పేరుమీద ఊర్లలో వదిలేస్తుంటారు. ఆవు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతుల వంటి జీవులను ఊరిదేవత పేరు మీద వదిలేస్తుంటారు. ఇప్పటికి గ్రామాల్లో ఇలాంటి సంప్రదాయం మనం చూస్తు ఉంటాం. అవి ఎక్కడికి వెళ్లిన, ఏంతిన్న ఎవరు కూడా కదిలించరు. అవి చాలా సార్లు.. మనుషులపైన దాడి చేస్తుంటాయి. ఒక్కొసారి.. అవి మూకుమ్మడిగా రోడ్డుమీద వచ్చిపోయే వారిపై దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు.. వ్యక్తులు తీవ్రంగా గాయపడుతుంటారు. మరికొన్నిసార్లు.. చనిపోయిన సంఘటనలు కూడా గతంలో అనేకం జరిగాయి. తాజాగా, మరోక ఘటన సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

పూర్తి వివరాలు.. హర్యానా లో (Haryana)  షాకింగ్ ఘటన జరిగింది. ఫరీదాబాద్ లో గత బుధవారం జరిగిన సంఘటన తాజాగా వైరల్ గా  మారింది. ఒక పెద్దాయన రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో ఒక దున్నపోతు అదే మార్గం గుండా వెళ్తుంది. అది పెద్దయనను గమనించింది. పాపం.. ఆయన తన చేతిలో ఒక చిన్నబకెట్ పట్టుకుని రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో.. ఏమైందో కానీ దున్నపోతు అక్కడికి కోపంతో వచ్చింది. పెద్దాయనను తన కొమ్ములతో అమాంతం గాలిలో పైకెత్తింది.

ఆ తర్వాత.. మరోవైపుకు విసిరి కొట్టింది. అక్కడున్నవారంతా షాకింగ్ కు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు.. పెద్దయనను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు. ఇంకా నయం కుమ్మేయలేదు.. మనోడి ఆయుశ్శు గట్టిదే అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒక ఇంట్లో రెండు పాములు టెన్షన్ ను పుట్టించాయి.

పూర్తి వివరాలు.. ఒడిషాలోని (Odisha)  భయంకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలో ఆరడుగుల పాము.. మరో కొండ చిలువను మింగేసింది. అంతే కాకుండా.. కాసేపు అక్కడ అవి రెండు కూడా పెనుగులాడుకున్నాయి. ఇంతలో పెద్దగా శబ్దం వస్తుండటంతో ఇంట్లోని వారు అక్కడికి వెళ్లి చూశారు.అప్పుడు.. కొబ్రా.. కొండ చిలువున తొలుత మింగేసింది. ఆతర్వాత.. చూస్తుండగానే బయటకు ఉమ్మేసింది. దీన్ని గమనించిన అక్కడి ఇంటి వారు.. స్నేక్ హెల్స్ సొసైటీవారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

పాము అప్పటికే, కొండ చిలువను ఉమ్మివేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది. స్నేక్ హెల్స్ సొసైటీవారు.. పామును బంధించి, దగ్గరలోని అడవిలో వదిలిపెట్టారు. దీన్ని చూడటానికి జనాలు గుంపులు, గుంపులుగా తరలివచ్చారు. పాముల ఫోటోలు తీశారు. అదే విధంగా.. సెల్ఫీలు దిగారు. వీడియోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడిక వీడియో వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Trending video, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు