VIDEO BABY ELEPHANT TEASES BIRD BY SPLASHING WATER GETS ATTACKED IN RETURN PVN
Viral Video : ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు గుణపాఠం చెప్పిన పక్షి
పక్షిని టీజ్ చేస్తున్న ఏనుగు
Baby Elephant Teases Bird : తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూస్తూ టీజింగ్ చేసేవారికి ఈ వీడియో ఒక గుణపాఠం. తనను ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు ఓ పక్షి తగిన గుణపాఠం చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.
nBaby Elephant Teases Bird : తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూస్తూ టీజింగ్ చేసేవారికి ఈ వీడియో ఒక గుణపాఠం. తనను ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు ఓ పక్షి తగిన గుణపాఠం చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూడడమంటే అది తెలివితక్కువతనమే. ఈ పక్షిలాగా ఏనుగును ఉరికించే సత్తా అందరికీ ఉంటుంది.’ అని దీపాన్షు ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో...నదిలో నీళ్లు తాగుతున్న పక్షిపై ఓ పిల్ల ఏనుగు నీళ్లు చల్లుతూ టీజ్ చేస్తుంది. అనంతరం ఏనుగు వెళ్లిపోతుండగా పక్షి వెంటపడి మరీ దాన్ని పొడుస్తుంది. కొద్ది సేపు ఆ పిల్ల ఏనుగుని ముప్పతిప్పలు పెట్టింది ఆ పక్షి. ఈ వీడియోను ఇప్పటివరకూ దాదాపు రెండు లక్షల మంది వీక్షించగా,వేల సంఖ్యలో లైక్ లు వచ్చాయి.
किसी को छोटा जानकर उसे तंग करना, मूर्खता है.
क्योंकि नन्हा पक्षी भी हाथी को नाच नचा सकता है. pic.twitter.com/AEpBFJyiDz
మరోవైపు,. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఎంతో ఖర్చు పెట్టి.. కుక్కలా మారిపోయాడు. ఇందుకోసం ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. . జపాన్ (Japan)లో జెప్పెట్ (Zeppet) అనే ప్రొఫెషనల్ కాస్ట్యూమ్ ఏజెన్సీ ఉంది. పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మస్కట్ పాత్రల దుస్తులను జెప్పెట్ సంస్థ తయారు చేస్తుంది. అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తోంది. తన కోరికను జెప్పెట్ నెరవేర్చగలదని భావించి. ఓ సారి వెళ్లి సంస్థ ప్రతినిధులను కలిశాడు టోకో.
తాను కోలి జాతి కుక్కలా మారాలనుకుంటున్నానని.. తనను అచ్చం అలాగే రెడీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు ఎంత ఖర్చైనా పరవా లేదు. తాను ఇస్తానని చెప్పాడు. అసలు ఇలాంటి ఆర్డర్ రావడం జెప్పెట్కు ఇదే తొలిసారి. ఒక మనిషిని జంతువులా ముస్తాబు చేయడం ఇంత వరకు ఎప్పుడూ చేయలేదు. అయినా సరే.. డీల్‌కు ఒప్పుకొని.. వెంటనే పనిని ప్రారంభిచింది. జెప్పెట్ సంస్థ ఆర్టిస్ట్‌లు ఎంతో కష్టపడి ‘కోలీ’ జాతీ కుక్క కాస్ట్యూమ్ (Dog Costume)ను రూపొందించారు. ఇందుకోసం వారికి 40 రోజుల సమయం పట్టింది. ఆ కాస్ట్యూమ్ని ధరించిన టోకో.. అచ్చం కుక్కలా మారిపోయాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.