హైవేపై 60 కి.మీ. వేగంతో కారు... నిద్రపోయిన డ్రైవర్

కారులోని డ్రైవర్, ఇంకో వ్యక్తి నిద్రపోతున్నారు. దీంతో ఆ కారు పక్కనే ఓవర్ టేక్ చేయబోయేందుకు వచ్చిన మరో కారు డ్రైవర్ దీన్ని గమనించాడు.

news18-telugu
Updated: September 11, 2019, 10:11 AM IST
హైవేపై 60 కి.మీ. వేగంతో కారు... నిద్రపోయిన డ్రైవర్
కారు డ్రైవ్ చేస్తూ నిద్రపోయిన డ్రైవర్
  • Share this:
ఓ కారు హైవైపై జామ్ జామ్ పనిపోతుంది. 20 కాదు 40 కాదు 60 కిలొమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అయితే ఆ కారును నడపాల్సిన డ్రైవర్ మాత్రం హాయిగా నిద్రపోయాడు. దీంతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఈ ఘటన చూసిన ఇతర వాహనదారులంతా షాక్ తింటున్నారు. కొందరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది ఇప్పుడు వైరల్ న్యూస్‌గా మారింది.

అమెరికాలోని మసాచుసెట్స్‌ న్యూటన్‌ హైవే మీద ఈ ఘటన చోటుచేసుకుంది. అది టెస్లాకారు. అందులో ఆటో పైలట్ ఫంక్షన్ కూడా ఉంది. అయినా, ప్రతి 30 సెకన్లకూ ఓసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ కూడా అప్రమత్తతో ఉండాలి. అటువంటిది... ఇంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళుతూ, డ్రైవర్ తో పాటు, అతని పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా ఆదమరిచి నిద్రపోతున్నారు.

కారులోని డ్రైవర్, ఇంకో వ్యక్తి నిద్రపోతున్నారు. దీంతో ఆ కారు పక్కనే ఓవర్ టేక్ చేయబోయేందుకు వచ్చిన మరో కారు డ్రైవర్ దీన్ని గమనించాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కారులోని వారిని అలర్ట్ చేయాలని హారన్ మోగించినా, వారు లేవలేదన్నాడు. వారు నిద్రపోతుండటాన్ని చూసి కంగారుపడిన అతను, "ఎంత అలసిపోయి ఉంటే మాత్రం, ఇలా డ్రైవింగ్‌ చేస్తున్నపుడు నిద్రపోతారా?" అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై టెస్లా సంస్థ కూడా స్పందించింది. తమ సంస్థకు చెందిన కార్లలో ఆటోపైలట్ ఫంక్షన్ ఉందని.. అయినా కూడా డ్రైవర్ అలర్ట్‌గా ఉండాలంది. హైవేపై వెళుతున్న వేళ, స్టీరింగ్‌ పై చేతులు లేకుంటే, నిమిషానికి రెండు సార్లు ప్రమాద సూచనలు వస్తాయని పేర్కొంది.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading