హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viagra Overdose: వయాగ్రా వేసుకున్న కొత్త పెళ్లికొడుకు.. 20 రోజుల పాటు అలాగే.. భార్యకు నరకం.. ఇక ఎప్పటికీ అంతే..

Viagra Overdose: వయాగ్రా వేసుకున్న కొత్త పెళ్లికొడుకు.. 20 రోజుల పాటు అలాగే.. భార్యకు నరకం.. ఇక ఎప్పటికీ అంతే..

Viagra over dose: వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న ఓ కొత్త పెళ్లికొడుకు.. అంగస్తంభనతో అల్లాడిపోయాడు. 20 రోజుల పాటు అలాగే ఉండడంతో.. భార్య కూడా భరించలేకపోయింది. చివరు డాక్టర్లు ఆపరేషన్ చేసినా.. సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు.

Viagra over dose: వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న ఓ కొత్త పెళ్లికొడుకు.. అంగస్తంభనతో అల్లాడిపోయాడు. 20 రోజుల పాటు అలాగే ఉండడంతో.. భార్య కూడా భరించలేకపోయింది. చివరు డాక్టర్లు ఆపరేషన్ చేసినా.. సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు.

Viagra over dose: వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న ఓ కొత్త పెళ్లికొడుకు.. అంగస్తంభనతో అల్లాడిపోయాడు. 20 రోజుల పాటు అలాగే ఉండడంతో.. భార్య కూడా భరించలేకపోయింది. చివరు డాక్టర్లు ఆపరేషన్ చేసినా.. సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు.

  సాధారణంగా అంగ స్తంభన సమస్యలున్న వారు వయాగ్రా వేసుకుంటుంటారు. డాక్టర్ల సలహాతోనే వీటిని వాడాల్సి ఉంటుంది. కానీ చాలా మంది మాత్రం తమకు తాముగానే వయాగ్రా మాత్రలు (Viagra tablets) తీసుకుంటున్నారు. శృంగారాన్ని ఎక్కువ సమయం పాటు ఆస్వాదించేందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వయాగ్రాను పరిమితికి మించి తీసుకుంటే డేంజర్. ఈ విషయం తెలిసినా.. కొందరు ఇష్టానుసారం తీసుకుంటున్నారు. మాత్రలకు మాత్రలు మింగి.. శృంగారంలో రెచ్చిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayag Raj)కు చెందిన ఓ యువకుడికి కూడా విచిత్ర అనుభవం ఎదురయింది. మోతాదుకు మించి.. వయాగ్రా మాత్రలు (Viagra Over dose) వేసుకోవడంతో.. ఆస్పత్రి పాలయ్యాడు. అంతేకాదు జీవితాంతం ఓ సమస్య ఎదుర్కోనున్నాడు? ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.

  రోజూ ఇంట్లో కనిపించే సాదాసీదా వస్తువు.. అమ్మితే రూ. 2 కోట్లు వచ్చాయ్.. ఇది అసలు స్టోరీ

  ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ యువకుడికి నెల రోజుల క్రితమే పెళ్లయింది. అతడు బాగానే ఉన్నాడు. శృంగారపరంగానూ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ పెళ్లైన కొత్తలో శృంగారాన్ని మరింతగా ఆస్వాదించాలంటే.. వయాగ్రా ఉండాల్సిందేనని.. స్నేహితులు ఉచిత సలహాలు ఇచ్చారు. అంతే వారి మాటను నమ్మి.. వయాగ్రాలకు అలవాటయ్యాడు ఆ యువకుడు. అలా రోజూ వయాగ్రా మాత్రలు వేసుకొని..భార్యతో శృంగారంలో పాల్గొనేవాడు. రోజులు గడిచే కొద్ది.. మోతాదు కూడా పెంచాడు. ఎంత ఎక్కువ డోస్ వేసుకుంటే.. అంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చని భావించాడు. సాధారణంగా రోజుకు 50 మిల్లీ గ్రాముల వరకు మాత్రమే వయాగ్రా మాత్రలు వేసుకోవచ్చు. కానీ అతడు ఏకంగా 200 మి.గ్రా. వరకు వెళ్లాడు. ఇటీవల ఓసారి అధిక మోతాదులో వయాగ్రా వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. భర్త తీరుతో అతడి భార్య విసిగిపోయింది. తన వల్ల కాదని.. పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు ఎలాగోలా నచ్చజెప్పి.. మళ్లీ భర్త వద్దకు పంపించారు.

  భార్య తిరిగి ఇంటికొచ్చినా.. అతడి సమస్య పరిష్కారం కాలేదు. అంగం గంటల తరబడి స్తంభించే ఉండడంతో.. అతడితో కాపురం చేయలేకపోయింది. చివరకు భర్తను ఆస్పత్రిలో చేర్పించి.. ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. డాక్టర్లు అతడి సమస్య గురించి తెలుసుకొని అవాకయ్యారు. వయాగ్రా వల్ల అతడిలో 'priapism' సమస్య తలెత్తిందని గుర్తించారు. ప్రయాపిజం అంటే.. అంగం మొత్తబడకుండా.. అలాగే స్తంభించి ఉండడం. ఆ సమస్య నుంచి బయటపడేందుకు.. డాక్టర్లు ఆపరేషన్ (penile prosthesis surgery )చేయలేకతప్పలేదు. రెండు సార్లు శస్త్ర చికిత్స చేసినా అంగ పరిమాణం మాత్రం తగ్గలేదు. అంగస్తంభన సమస్య నుంచి బయటపడినా... అలాగే ఉబ్బిపోయి ఉంది. అంటే పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. అందువల్ల దానిని దాచిపెట్టేందుకు బిగుతైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది.

  8 ఏళ్ల క్రితం బైక్ చోరీ.. రీసెంట్‌గా యజమాని ఫోన్‌కు చలాన్ మెసేజ్.. బైక్ వాడుతున్నది ఎవరంటే

  ఈ కేసుపై డాక్టర్లు మాట్లాడుతూ.. ‘'సాధారణంగా ఎరెక్టిల్ డిస్ఫంక్షన్ సమస్య ఉన్నవారు మాత్రమే వయాగ్రా మాత్ర తీసుకుంటారు. కానీ ఆ యువకుడు తనకు అవసరం లేకున్నా.. పరిమితికి మంచి మాత్రలు వేసుకున్నాడు. అందువల్ల అంగం అలాగే స్తంభించి ఉండిపోయింది. ఆపరేషన్ చేసి ఎరెక్షన్‌ను తగ్గించగలిగాం. ఆ వ్యక్తి పిల్లలను కనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేటు పార్టు మాత్రం ఉబ్బినట్లుగానే కనిపిస్తుంది. ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది.'' అని పేర్కొన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: National, Up news, Uttar pradesh, Viagra

  ఉత్తమ కథలు