• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VERY RARE VERY RARE FISH FOUND IN VIZAINAGARAM ABOVE 60 KGS WEIGHT NGS

Andhra Pradesh: ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలలో వింత వింత చేపలు? వీటి స్పెషాలిటీ ఏంటి?

Andhra Pradesh: ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలలో వింత వింత చేపలు? వీటి స్పెషాలిటీ ఏంటి?

ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలలో ఇటీవల వింత చేపలు పడుతున్నాయి. మొన్న విశాఖలోని సానిపాప వలకి చిక్కి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. తాజాగా విజయనగరం జిల్లాలో 60కిలోలకి పైగా బరువు ఉన్న మట్ట చిక్కింది.

ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలలో ఇటీవల వింత చేపలు పడుతున్నాయి. మొన్న విశాఖలోని సానిపాప వలకి చిక్కి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. తాజాగా విజయనగరం జిల్లాలో 60కిలోలకి పైగా బరువు ఉన్న మట్ట చిక్కింది.

  • Share this:
    సువిశాల సముద్ర తీరం ఉన్న ఉత్తరాంధ్రలో.. చాలామందికి అదే జీవనాధారం. ముఖ్యంగా సముద్ర తీరంలో చేపల వేటను నమ్ముకునే కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సముద్రంలోకి సాహసం చేసి వెళ్లడం.. చేపలు వేటాడడం వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇలా వేటకు వెళ్తున్న కొందరు మత్స్యకారుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి కొన్ని చేపలు. ఇటీవల మత్స్యకారుల వలలో వింత వింత చేపలు వచ్చి పడుతున్నాయి?

    తాజాగా విజయనగరం జిల్లాలో మత్స్యకారుడి వలకు అరుదైన చేప చిక్కింది. భోగాపురం మండలం ముక్కాం తీరం సముద్రంలో జాలరి వాసుపల్లి ఎర్రయ్య ప్రతి రోజూలాగే వేటకు వెళ్లాడు. అయితే ఊహించని విధంగా అతడి వల చాలా బరువెక్కిపోయింది. దీంతో మొదట భయపడ్డాడు. తిమింగళం లాంటిది ఏమైనా పడిందా? ఎప్పుడూ లేనిది ఇంత బరువు ఉంది అని భయపడ్డాడు.

    అలా భయపడుతూనే వలను బయటకు తీసిన అతడు అందులో చిక్కిన చేపను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. సుమారు 60 కిలోల బరువు ఉండడంతో షాక్ తిన్నాడు. దీన్ని పరిశీలించిన మత్స్యకారుల పెద్దలు.. పెద్దమట్ట అని పిలుస్తారని చెప్పారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 25కేజీల బరువున్న ఇలాంటి చేప వలలో పడిందని తెలిపాడు. ఇప్పుడు దొరికిన పెద్దమట్ట 60 కేజీలకుపైగా బరువు తూగిందని తెలుస్తోంది. ఈ చేపకు మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉందని స్థానిక మత్సకారులు వెల్లడించారు

    నిత్యం చేపల వేటతో జీవనం సాగిస్తున్న మరో మత్స్యకారుడి వలకు ఇటీవల అరుదైన చేప చిక్కింది. ఆ చేపను చూసిన జాలరి అవాక్కయ్యాడు. గతంలో ఎన్నాడూ చూడని రీతిలో కనిపించిన చేపను చూసిన స్థానిక మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మొదట ఈ అరుదైన చేపను గుర్తించారు. వారి వలలో పడ్డ చేప వివిధ రంగుల్లో ఉండడంతో ఆ మత్స్యకారుడు తెగ సంబరపడి పోయాడు. అలా వివిధ రంగల్లో ఉన్న ఆ చేప పేరు సానిపాప అని స్థానిక మత్స్యకారులు చెప్పారు. అది చాలా అరుదైన చేప అన్నారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశంలో మాత్రమే సానిపాపలు ఉంటాయి. సానిపాప మత్స్యకారుడుకి దొరికిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు 60 కిలోల చేప వలలో పడింది.

    ఉత్తరాంధ్రలోనే కాదు.. గతంలో మహబూబాబాద్‌ జిల్లా‌లో ఓ మత్స్యకారుడికి ఓ అరుదైన చేప చిక్కింది. జిల్లాలోని కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది. ఈ చేప బరువు..తొమ్మిది కేజీలకు పైగా ఉందని అప్పుడు మత్య్సకారులు తెలిపారు. పైగా అది బంగారు రంగులో కనిపించడంతో ఆ చేప వైరల్ గా మారింది. ఇలా వింత వింత చేపలు వలలో పడి మత్స్యకారులు ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు