హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Melinda - Billgates : ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం ..ఖర్చు ఎంతో తెలుసా..?

Melinda - Billgates : ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం ..ఖర్చు ఎంతో తెలుసా..?

Melinda - Billgates : చాలా సింపుల్‌గా ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం

Melinda - Billgates : చాలా సింపుల్‌గా ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం

Melinda - Billgates : బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహం సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగింది. ఆ ఇద్దరి పెళ్లి కేవలం 14 కోట్ల రూపాయల ఖర్చుతోనే ముగించడం విశేషం.

ఇంకా చదవండి ...

వివరాల్లోకి వెళితే.. ఈనెల 16న ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహం సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగింది.

అయితే మాములుగా వందల కోట్లు ఉన్న బిజినెస్‌మెన్‌ నివాసాల్లోనే వందల కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లిలను అంగరంగ వైభవంగా కొనసాగుతుంటాయి. హంగు ఆర్భాటాలతో పెళ్లి తంతును ముగిస్తారు. ఇటివల భారత్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కూతురు వివాహానికి సుమారు రెండు వందల కోట్ల రూపాయాల ఖర్చుతో పెళ్లి తంతు ముగించినట్టు సమాచారం. అలాంటీది అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉన్న బిల్‌గేట్స్‌ మాత్రం చాలా సింపుల్‌గా తన కూతురు ప్రేమ వివాహాన్ని ముగించారు. అయితే ఇందుకు కారణం కరోనా అని చెబుతున్నారు. పూర్తి కరోనా నిబంధనలతో చాలా సిక్రేట్‌ కేవలం మూడు వందల మంది కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులతో కలసి పెళ్లి వేడుకను నిర్వహించినట్టు సమాచారం.

ఎంత సింపుల్‌గా అంటే కేవలం 14 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అయినట్టు చెప్పారు. కాగా ఈ పెళ్లి వేడుక న్యూయార్క్‌‌లోని ఉత్తర సేలం కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో జరిగింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాజర్, జెన్నీఫర్ ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇది చదవండి : వారాంతపు సంతలో మనుషుల వేట -43 మందిని కాల్చిచంపిన దుండగులు -కల్లోల Nigeriaలో మరో దారుణం


ఇక కొన్ని నెలల క్రితం మిలిందా,బిల్ గేట్స్‌తో ( melinda , Billgates) విడాకులు తీసుకున్నతీసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. బిల్‌గేట్స్‌.. కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ( marriage ) ఒకరోజు ముందుగానే హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నట్టు తెలిపారు. కాగా వివాహ వేడుకకు ( marriage function ) అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్‌-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా ( america ) తరఫున నాజర్‌ ‌గుర్రపు స్వారీ లో పాల్గొన్నాడు.

ఇది చదవండి :  ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్


ఈజిప్టు సంతతికి చెందిన నాయల్‌ నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో (Dating ) ఉన్నారట. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించినట్టు సమచారం. చివరకు సోషల్‌ మీడియా ( Social media ) వేదికగా జెన్నీఫర్‌ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించారు.

బిల్‌గేట్స్‌-మిలిందా మే 4న విడాకులు ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్‌గేట్స్‌ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్‌గేట్స్‌ దంపతులకు ( Gates family ) ముగ్గురు సంతానం. జెన్నీఫర్‌ గేట్స్‌, రోరీ గేట్స్‌, ఫీబీ అడెల్‌ గేట్స్‌. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్‌ గేట్స్‌. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట.

First published:

Tags: Bill Gates, International news, Marriage

ఉత్తమ కథలు