హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు..

Hyderabad Vegetable Rates : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని నల్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు.

news18-telugu
Updated: March 23, 2020, 9:40 AM IST
హైదరాబాద్‌లో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని నల్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలపై కన్నేశారు. ఓ వైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారులు కూరగాయల ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచేశారు. సరూర్ నగర్ రైతు బజార్‌లో కొనుగోలుదారులు, వ్యాపారుల మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో ఏమీ చేయలేక మార్కెట్ అధికారులు చేతులెత్తేశారు. అటు.. మెహిదీపట్నం రైతు బజార్‌లో జనం కిక్కిరిసిపోయారు. అయితే, రేట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా, గుడిమల్కాపూర్ పూల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 23, 2020, 9:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading