బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న సిసింద్రీ... వైరల్ వీడియో...

పిల్లలందరూ క్రికెట్ ఆడటం సహజం. ఐతే... డైపర్ వేసుకునే ఏజ్‌లోనే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఆడే రేంజ్‌లో బ్యాటింగ్ చెయ్యడం విశేషం. ఇప్పుడా చిన్నారి వీడియో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: November 12, 2019, 6:48 AM IST
బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న సిసింద్రీ... వైరల్ వీడియో...
బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న సిసింద్రీ... వైరల్ వీడియో... (cricket - twitter - Fox Cricket)
  • Share this:
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాఘన్... ఓ వీడియోపై ట్విట్టర్‌లో జోక్ చేశాడు. అందులో వేలెడంత లేని, డైపర్ వేసుకున్న చిన్నారి... బ్యాటింగ్ ఇరగదీశాడు. వచ్చే ప్రతీ బంతినీ వేర్వేరు యాంగిల్స్‌లో కొడుతూ... అద్భుతమైన కవర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పిల్లాడు ఎప్పటికైనా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కి సూపర్ కేట్ అవుతాడని వాఘన్ జోక్ చేశాడు. ఈ వీడియోని ఫాక్స్ క్రికెట్... ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ చిన్నారిని చూస్తే... చిన్నప్పుడు క్రికెట్ ఆడిన సచిన్ గుర్తొస్తున్నాడని చాలా మంది అంటున్నారు. సచిన్ లాగే ఈ బుడతడు కూడా... ఇండోర్‌లో ఆడుతున్నా... ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ చేస్తూ... బాల్‌ను చితకబాదడంపై అందరూ తెగ లైక్ చేస్తున్నారు.


ఇప్పుడే ఇలా ఆడుతున్నాడంటే... ఈ చిన్నారికి తగిన ట్రైనింగ్ ఇస్తే... కచ్చితంగా ది బెస్ట్ క్రికెటర్ అవుతాడని అంతా అంటున్నారు. వైరలైన ఈ వీడియోకి లైక్స్ వెల్లువలా వస్తున్నాయి. కామెంట్ల తుఫాను కనిపిస్తోంది. వీరేందర్ సెహ్వాగ్ కంటే బాగా ఫుట్ ‌వర్క్ చేస్తున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశారు. 

Pics : వీరా ఫేమ్ అరిష్ఫాఖాన్ క్యూట్ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :

39వ రోజుకు ఆర్టీసీ సమ్మె... నేడు హైకోర్టు ఏం చెబుతుంది?

ఆసక్తిగా మహారాష్ట్ర రాజకీయాలు... రాష్ట్రపతిపాలన తప్పదా?

Health Tips : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... ఇదీ చరిత్ర?


Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి

బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading