హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: 14నెలలుగా మూత్ర విసర్జన చేయని మహిళ..ఫైనల్‌గా ఏం చేశారో తెలుసా..?

OMG: 14నెలలుగా మూత్ర విసర్జన చేయని మహిళ..ఫైనల్‌గా ఏం చేశారో తెలుసా..?

Viral News

Viral News

OMG:ఒక మహిళ 14నెలలుగా మూత్ర విసర్జన చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. డాక్టర్లకు చూపించుకుంటే షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇదో వింత వ్యాధి అని..దాని వల్లే మూత్ర విసర్జన చేయలేకపోతున్నారని చెప్పారు. అందుకు ఏం ట్రీట్‌మెంట్ చేసారో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏ టైమ్‌కి జరగాల్సిన పని అప్పుడే అయిపోయాలి. కాస్త లేట్ అయినా ఎంత ప్రమాదమో ఆ బాధను భరించే వాళ్లకు తెలుస్తుంది. అన్నీ విషయాలు సంగతి ఏమో కాని ముఖ్యంగా కాలకృత్యాల విషయంలో మాత్రం ఇది తప్పని సరిగా వర్తిస్తుంది. చాలా మందికి మల, మూత్ర విసర్జనలు నిత్యం ఒకే టైమ్‌లో చేస్తుంటారు. కొందరు కాస్త అటు ఇటుగా పని పూర్తి చేస్తారు. కాని బ్రిటన్‌(Britain)కి చెందిన ఎల్లీ ఆడమ్స్ (Ellie Adams)అనే మహిళ 14నెలలుగా మూత్ర విసర్జన (Urination)చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.డాక్టర్ల దగ్గరకు చూపించుకుంటే షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇదో వింత వ్యాధి అని..దాని వల్లే మూత్రం వస్తున్నట్లుగా ఉండి విసర్జించలేకపోతున్నారని తేల్చి చెప్పారు. పౌలర్స్ సిండ్రోమ్‌ అనే ఈ వ్యాధికి చికిత్స లేదని..అందరికిలా మూత్ర విసర్జన చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. మరి మూత్ర విసర్జన చేయడానికి ఆడమ్స్‌కు ప్రత్యేకించి ఓ ట్యూబ్‌(Tube)ని అమర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి వర్ణనాతీతంగా మారింది.

మూత్ర విసర్జన చేయని మహిళ..

ప్రతి మనిషి జీవితంలో రోజు వారి జరిగే జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థ సవ్యంగా పని చేయాలి. లేదంటే వాళ్లు ఎదుర్కొనే సమస్యలు మాటల్లో చెప్పలేనంత కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన విషయంలో ప్రతి రోజూ టైమ్ ప్రకారం జరిగితే వాళ్లలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. బ్రిటన్‌కి చెందిన ఎల్లీ ఆడమ్స్‌ అనే ఓ కంటెంట్‌ క్రియేటర్‌కి మూత్ర విసర్జన విషయంలో గత ఏడాదికిపైగా ఇబ్బంది పడుతోంది. మూత్ర వస్తున్నట్లుగా అనిపించడం..విసర్జన చేసేందుకు వెళ్తే రాకపోవడంతో నిత్యం నరకం అనుభవించింది. సుమారు 14నెలలుగా ఇదే పరిస్ధితిని అనుభవించింది ఎల్లీ ఆడమ్స్. ఓ ఇంగ్లీష్‌ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈవిషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది.

14నెలలుగా నరకం..

మూత్ర విసర్జన చేయలేక ఇబ్బందిపడుతున్న ఆడమ్స్ 2020అక్టోబర్‌లో డాక్టర్‌ను సంప్రదించింది. వైద్యులు అన్నీ పరీక్షలు చేసి పౌలర్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్లే ఇలాంటి సమస్య తలెత్తినట్లుగా గుర్తించారు. మూత్రాశంలో మూత్రం పేరుకుపోవడం వల్ల నొప్పి కలగడం, మూత్ర విసర్జన చేయలేకపోవడం జరుగుతోందని తేల్చారు. అయితే అందరి మూత్రాశయంలో అర లీటర్‌ పరిమాణంలో యూరిన్ స్టోర్ అయి ఉంటుందని ..ఆడమ్స్‌ మూత్రాశయంలో మాత్రం లీటర్‌కుపైగా పేరుకుపోయి ఉండటంతో ట్యూబ్‌ ద్వారా పేరుకుపోయిన యూరిన్‌ను బయటకు తీశారు.

OMG: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 6 మద్యం బాటిల్స్ ఇవే.. ఒక్క సిప్ లక్షల్లోనే..కాళీ బాటిల్ కూడా ఖరీదే

ఇకపై ట్యూబ్ ద్వారానే..

తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు చేసిన రబ్బర్ ట్యూబ్‌(క్యాతెటర్‌)ని పర్మినెంట్‌గా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. లేదంటే మూత్రాశంలోంచి మూత్రం బయటకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. వేరే దారి లేకపోవడంతో ఆడమ్స్ అంగీకరించింది. దీంతో మూత్ర విసర్జనకు కారణమయ్యే నాడుల్ని ప్రేరేపించి వెన్నుముక కింద ఓ చిన్న పరికరాన్ని అమర్చారు. ఈ ట్యూబ్‌ అమర్చడం వల్ల తాను 14నెలలుగా పడుతున్న ఇబ్బంది కాస్త తొలగిపోయిందని చెబుతున్నప్పటికి ..డాక్టర్లు మాత్రం ఆమె జీవితాంతం ఆ ట్యూబ్‌ ద్వారానే మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

First published:

Tags: Britan, International news, Trending news

ఉత్తమ కథలు