• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VARIETY CAKES IN MARKET THIS ART DIRECTOR TURNED HER ENTIRE OUTFIT INTO CAKES SK GH

Variety Cakes: ఇవి దుస్తులు కాదు.. కేకులు.. నమ్మలేకపోతున్నారా? మీరే చూడండి

Variety Cakes: ఇవి దుస్తులు కాదు.. కేకులు.. నమ్మలేకపోతున్నారా? మీరే చూడండి

దుస్తుల్లాంటి కేకులు

ఈ హాలీవుడ్ డిజైనర్ తయారు చేసిన కేకులో ప్యాంట్, స్పఘెట్టి టాప్, గోధుమ రంగులోని కోటు వంటివి మనం చూడవచ్చు. లీజ్ ఎల్లప్పుడూ ఇటువంటి కొత్త ప్రయోగాలు చేస్తుంది.

  • Share this:
సోషల్ మీడియా విస్తృతితో ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోను చూస్తే మీ కళ్లను అస్సలు నమ్మలేరు!.. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ డిజైనర్ ఈ వెరైటీ కేకును తయారు చేసింది. సృజనాత్మకత ఉంటే దేన్నైనా కేకులా మార్చవచ్చని నిరూపిస్తూ.. తన దుస్తులను పోలి ఉన్న కేకులను రెడీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఈ కేకు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ది అమెరికన్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ డెజర్ట్ డిజైనర్ లిజ్ జాయ్ ఈ అద్భుతమైన కేకు తయారు చేసి నెటిజన్లను ఫిదా చేస్తోంది. వృత్తి రీత్యా ఒక ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున లిజ్ జాయ్.. వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి ఎన్నో హాలీవుడ్ స్టూడియోలతో కలిసి పనిచేసింది. తన అనుభవాన్నంతా కలబోసి ఈ అద్భుత సృష్టిని రూపొందించింది.

ఆమె తయారు చేసిన కేకులో ప్యాంట్, స్పఘెట్టి టాప్, గోధుమ రంగులోని కోటు వంటివి మనం చూడవచ్చు. లీజ్ ఎల్లప్పుడూ ఇటువంటి కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఆమె జీవితంలో ఫ్యాషన్కు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, మనుషులు ధరించే దుస్తులు వారి వ్యక్తిత్వాన్ని చెప్పడంలో ముందుటాయని ఆమె బలంగా విశ్వసిస్తుంది. కాగా, ఆమె తాజా సృష్టిని గత వారం ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా.. అది ఇప్పటివరకు 3 వేల లైక్‌లను సంపాదించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. ‘వావ్, మీ సృష్టి చాలా అందంగా ఉంది’ అన్నాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ ‘నేను మీ క్రియేషన్స్‌ను ఫాలో అవుతుంటాను. ఎప్పటిలాగే ఈసారి మీరు నన్ను మరింతగా ఆశ్చర్యపరిచారు’ అన్నాడు.


ఇక, లిజ్ ఈ ఫోటోలను రెడ్డిట్లో కూడా పోస్ట్ చేయగా.. అక్కడ ఆమె సృష్టిని రెడ్డిటర్స్ ప్రశంసించారు. ఒక యూజర్ స్పందిస్తూ “వావ్, అవి నిజంగా కుకీలతో తయారు చేసిన దుస్తులని నమ్మడానికి నాకు చాలా సమయం పట్టింది. మీ సృష్టి చాలా బాగుంది!!" ఇలా వ్యాఖ్యానించాడు. "మీ ఎడమవైపు ఉన్న దుస్తులు కుకీలతో తయారు చేసినవని మొదట్లో నేను అస్సలు గ్రహించలేదు. దీనికి నాకు చాలా సమయం పట్టింది.” అని అన్నాడు. కాగా, రెడ్డిట్లో ఆమె అందుకున్న ప్రోత్సాహకరమైన కామెంట్స్పై స్పందిస్తూ “చాలా ధన్యవాదాలు! నేను ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్టులు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతాను. ఎందుకంటే, నేను ఎంతో మంది గొప్ప ఆర్ట్ డైరెక్టర్స్, కళాకారుల నుంచి స్ఫూర్తి పొందాను. మీరంతా నన్ను ఎంకరేజ్ చేయడంగా నిజంగా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ” అని అన్నారు. ఈ బేకరీ కళను నేర్చుకోవటానికి ఆసక్తి ఉన్నవారి కోసం లిజ్ ఒక బ్లాగును కూడా ప్రారంభించింది. లిజ్ ఈ క్రోసెంట్ కేకులను ఎలా తయారు చేసిందో తన బ్లాగ్ ద్వారా ప్రేక్షకులకు చూపించింది.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు