karthika deepam: డాక్టర్ బాబు మనసు కరిగింది.. వంటలక్క కోసం ఏం చేశాడంటే?

karthika deepam: కార్తీకదీపం.. ఇటీవలే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుంచి అధిక స్థాయిలో టీఆర్పీని తీసుకొచ్చింది.

karthika deepam: కార్తీకదీపం.. ఇటీవలే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుంచి అధిక స్థాయిలో టీఆర్పీని తీసుకొచ్చింది.

  • Share this:
    karthika deepam: కార్తీకదీపం.. ఇటీవలే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుంచి అధిక స్థాయిలో టీఆర్పీని తీసుకొచ్చింది. అంతా టాప్ టీఆర్పీ రావడానికి ఈ సీరియల్ నటులు, ట్విస్ట్‌లే కారణం. సీరియల్‌లో నటించే వారు ఎవరికి ఎవరు తగ్గకుండా అద్భుతంగా నటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

    వంటలక్క చెప్పినది నమ్మకుండా తను విన్నదే నిజం అని ఆమె చెప్పేది అంతా అబద్దం అంటూ డాక్టర్ బాబు దారుణంగా అవమానించడంతో పిల్లలను తీసుకోని వేరే ఊరుకు వచ్చిన వంటలక్క నాన్న టిఫిన్ అంటూ షాప్‌ను ఓపెన్ చేసింది. సౌర్య తెలివితేటలతో నాన్న టిఫిన్ సెంటర్‌కు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ వచ్చింది. మరోవైపు డాక్టర్ బాబు, సౌందర్య, దీప తండ్రి మురళి కృష్ణ అంతా దీప కోసం వెతకగా మురళీ కృష్ణకు దీప కనిపించింది.

    అయితే దీప కనిపించింది అనే విషయాన్నీ సౌందర్యతో చెప్పకుండా దీప ఒట్టు వేయిచుకోగా మౌనిత ద్వారా వంటలక్క ఎక్కడ ఉంది అనే విషయం డాక్టర్ బాబుకు తెలిసింది. విషయం తెలియగానే ఆగమేఘాలపై తన కూతుర్ల కోసం వెళ్ళాడు డాక్టర్ బాబు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే హిమా టిఫిన్స్ అందిస్తూ కనిపిస్తుంది. దీంతో డాక్టర్ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ విషయంపైన వంటలక్కను నిలదియ్యగా వంటలక్క అని పేరు నాకు వచ్చింది నాతోనే పోతుంది అంటూ జవాబు ఇస్తుంది.

    new twist in karthika deepam serial

    మరుసటి రోజు దీప కోసం మురళి కృష్ణ దోశలు, బజ్జిలు వేసినట్టే.. తన కూతుర్ల కోసం డాక్టర్ బాబు దోశలు వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఈ ఎపిసోడ్‌లో వంటలక్క, హిమ, సౌర్య డాక్టర్ బాబు చేసిన పనికి షాక్ అవ్వగా మోనిత కోపంతో రగిలిపోతుంది. మరి మోనిత ఎం చేయనుంది.. దోశలు వెయ్యడం వెనుక డాక్టర్ బాబు ఆంతర్యం ఏమిటి అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.
    Published by:Navya Reddy
    First published: