karthika deepam: బుల్లితెరపై ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రతి రోజు ఓ ట్విస్ట్ తో కొనసాగే ఈ కథ టీఆర్పీలో నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఇక ఈరోజు వెయ్యి ఎనిమిదో ఎపిసోడ్ పూర్తి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ సౌర్యతో మాట్లాడుతూ ప్రారంభం అయ్యింది.
అమ్మ మిమ్మల్ని మర్చిపోలేకపోయేది నాన్న.. మా కోసం చాలా కష్టాలు పడింది అమ్మ అంటూ డాక్టర్ బాబుకు చెప్పుకొస్తుంది సౌర్య. ఇంకా సౌందర్య ఆనంద్ లు కార్తీక్, దీప చాలా ముభావంగా ఉన్నారని.. ఏదో విషయం వారి నుంచి దాస్తున్నట్టు సౌందర్య అనుమానిస్తుంది. ఇక ఇక్కడ దీప ఆలోచనలో పడుతుంది.
నన్ను డాక్టర్ బాబు ప్రేమగా ఇంటికి తీసుకురాలేదు అనుకుంటూనే ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు అన్ని కార్తీక్ ఆమెను అనినా మాటలు అన్ని గుర్తుతెచ్చుకుంటుంది దీప. ఆ సమయంలోనే అక్కడ ఉన్న కూరగాయలను అన్నింటిని ఒక పక్కకు తోసేసి ఆలోచనలు మొదలుపెడుతుంది. అప్పుడే పనిమనిషి మాలతీ వచ్చి దీపతో మాట్లాడుతూ మళ్ళీ వంటలక్క ఇంటికి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తుంది.
గడప వరకు సంతోషంగా వచ్చిన నేను ఇంట్లోకి వచ్చాక ఆ ఆనందం మొత్తం పొయ్యింది అంటూ మళ్ళీ మానసిక వేదనతో సమస్యలకు గురవుతుంది. ఇక అప్పుడే హిమ డాక్టర్ బాబుతో నిమ్మకాయ సోడా నేర్చుకున్నట్టు చెప్తుంది. అది కూడా అమ్మకు తెలియకుండా నేర్చుకున్నట్టు చెప్పింది. అలాగే వంటలక్క వేడి అన్నం కూడా ముట్టుకోలేని స్థితిలో చేతులు కాలేవి అని టిఫిన్ సెంటర్ కష్టాలు అన్ని చెప్తే.. ఇక ఎప్పుడు ఆ కష్టాల గురించి నా దగ్గర చెప్పకు హిమ అంటూ డాక్టర్ బాబు చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోగా.. రేపటి ఎపిసోడ్ లో వంటలక్కను ఆరోగ్యం బాలేదని హాస్పెటల్ తీసుకెళ్లాలని డాక్టర్ బాబు చూడగా ఆమె నాకు క్లారిటీ కావాలి డాక్టర్ బాబు, మీరు నన్ను మోసం చేశారు అంటే నేను మోసం చేశానా అని డాక్టర్ బాబు అంటడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka