Karthika Deepam: కార్తీకదీపం.. తెలుగు రాష్ట్రలో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న సీరియల్. వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ వరుసగా ట్విస్ట్ లతో కొనసాగుతుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న వంటలక్క.. ఆమెకు ఏం అవుతుందో అని టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు ఘటనలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయ్. మోనిత మోసపూరిత మాటలు విని డాక్టర్ బాబుకు వంటలక్క అంటే కోపం కానీ లేకపోతే వంటలక్క అంటే డాక్టర్ బాబుకు ఎంతో ప్రేమ.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో వంటలక్కను ఆస్పత్రికి రమ్మని డాక్టర్ బాబు పిలవగా.. వంటలక్క రాను అని చెప్పేస్తుంది. మీరు నన్ను ప్రేమగా మీ భార్యలాగ తీసుకుపోతే వస్తా కానీ లేకపోతే వచ్చే సంగతి లేదు అంటూ తేల్చి చెప్తుంది వంటలక్క. నాది ముండి తనం, పొగరు కాదు డాక్టర్ బాబు ఆత్మభిమానం. మీరు నన్ను ఒప్పుకోవాలి.. నేను తప్పు చెయ్యలేదని తెలుసుకోవాలి.. తులసి చెప్పింది నిజం అని మీరు నమ్మాలి అంటూ వంటలక్క చెప్తుంది.
మరోవైపు సౌందర్య, ఆనంద్ రావులు ఆమెకు బిజినెస్ పెట్టించాలని.. ఆమెకు మంచి జీవితం కల్పించాలని అనుకుంటే.. నేను ఆస్థి కావాలి అనుకుంటే మీరు నాకు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు మావయ్య.. నేను ఇన్నాళ్లు ఎదురు చూసింది ఆస్థి కోసం కాదు.. నా భర్త ప్రేమ కోసం అంటూ సమాధానం ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వంటలక్క మళ్లీ ఇల్లు దాటాలని నిర్ణయించుకుంటుంది. మరి అత్తింటి నుంచి వెళ్తుందా? లేక పిల్లల కోసం అక్కడే ఉంటుందా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka