ట్రైన్ 18లో టిక్కెట్టు ధరలు ఎంతో తెలుసా?

Vande Bharath Express | Train18 | అత్యంత అధునాతన టెక్నాలజీతో, రాకెట్‌లాంటి వేగంతో దూసుకుపోయే ట్రైన్ 18 త్వరలోనే ఇండియాలో చక్కర్లు కొట్టబోతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసుకున్న ఈ హై స్పీడ్ ట్రైన్‌లో టిక్కెట్ల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.

news18-telugu
Updated: February 11, 2019, 7:06 PM IST
ట్రైన్ 18లో టిక్కెట్టు ధరలు ఎంతో తెలుసా?
వందే భారత్ ఎక్స్‌ప్రెస్(File)
news18-telugu
Updated: February 11, 2019, 7:06 PM IST
దేశంలో తుఫాన్ వేగంతో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమైంది ట్రైన్ 18. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 15న పట్టాలెక్కనున్న ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లో చార్జీలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఢిల్లీ, వారణాసి మధ్య ఈ ట్రైన్ 18కు సంబంధించిన చార్జీలను.. రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్, ఎక్స్‌క్యూటివ్ కార్ అనే రెండు ప్రత్యేక విభాగాలను కలిగిన ఉన్న ఈ ట్రైన్18లో టిక్కెట్ల ధరలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.

vande mataram express, vande mataram express route, vande mataram express fare, vande mataram express speed, vande mataram express train booking, train 18, train 18 schedule, train 18 ticket cost, piyush goyal, వందేమాతరం ఎక్స్‌ప్రెస్, పీయూష్ గోయల్, ట్రైన్ 18
వందే భారత్ ఎక్స్‌ప్రెస్


న్యూ ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ప్రయాణికులు ఎయిర్ కండిషన్డ్ చెయిర్ కార్ టిక్కెట్‌ కోసం రూ. 1850 చెల్లించాల్సి ఉంటుంది. అంతే దూరానికి, రిటర్న్ జర్నీ కోసం రూ. 1795 చెల్లించాలి. అదే, ఎక్స్‌క్యూటివ్ కార్ టిక్కెట్ కోసం ఢిల్లీ నుంచి వారణాసికి రూ. 3520 చెల్లించాల్సి ఉంటుంది. అంతే దూరానికి రిటర్న్ జర్నీ కోసం రూ. 3470 చెల్లించాలి. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ల ధరలతో పోల్చితే.. ట్రైన్ 18లోని ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్ ధరలు 1.5 రెట్లు, ఎక్స్‌క్యూటివ్ కార్ ధరలు 1.4 రెట్లు ఎక్కువ.

డిసెంబర్ 25న ట్రెయిన్ 18 ప్రారంభం: వేగం గంటకు 180 కిలోమీటర్లు, Train 18 is Coming to Town! This Christmas, Varanasi Locals Could be 1st Passengers of High Speed Loco
ట్రెయిన్ 18
ఇక, హైస్పీడ్ ట్రైన్‌లో భోజనాలు, ఫలహారాల ధరలు కూడా భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. న్యూ ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే ఎక్స్‌క్యూటివ్ క్లాస్ ప్రయాణికులు మార్నింగ్ టీ, పలహారం, మధ్యాహ్నం భోజనం కోసం రూ. 399 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే, చైర్‌కార్ ప్యాసెంజర్లయితే రూ. 344 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, రిటర్న్ జర్నీలో ఎక్స్‌క్యూటివ్ చైర్ ప్రయాణికులు రూ. 349, చైర్‌కార్ ప్రయాణికులు రూ. 288 చెల్లించాల్సి ఉంటుంది. న్యూ ఢిల్లీ నుంచి కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రయాణికులు ఎక్స్‌క్యూటివ్ చైర్ ప్రయాణికులు రూ. 155, చైర్‌కార్ ప్రయాణికులు రూ. 122 చెల్లించాలని ఉన్నతాధికారులు చెప్పారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...