హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: కాబోయే భార్య మీద ఎంత ప్రేమో.. చంద్రుడిపై స్థలం కొన్న గుజరాత్​ వ్యాపారి

OMG: కాబోయే భార్య మీద ఎంత ప్రేమో.. చంద్రుడిపై స్థలం కొన్న గుజరాత్​ వ్యాపారి

ఏప్రిల్ 14 నుంచి మూడు నెలల పాటు జరిగే లగ్నాల్లో లగ్నంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40 లక్షల వివాహాలు జరగవచ్చని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (క్యాట్) పేర్కొంది. ఇది మందగించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ 14 నుంచి మూడు నెలల పాటు జరిగే లగ్నాల్లో లగ్నంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40 లక్షల వివాహాలు జరగవచ్చని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (క్యాట్) పేర్కొంది. ఇది మందగించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు.

Surprise Gift: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ఈ వేడుకను ప్రతి ఒక్కరు గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసుకొవాలనుకుంటారు. గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి తన కాబోయే భార్యకు ఎవ్వరు ఊహించని ఒక సర్​ప్రైజ్ గిఫ్ట్​ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral News)​గా మారింది.

ఇంకా చదవండి ...

Surprise Gift: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ఈ వేడుకను ప్రతి ఒక్కరు గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసుకొవాలనుకుంటారు. తమకు కాబోయే భాగస్వామికి సర్​ప్రైజ్ (Surprice Gift) గిఫ్టులివ్వడానికి ప్లాన్లు వేస్తుంటారు. గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి తన కాబోయే భార్యకు ఎవ్వరు ఊహించని ఒక సర్​ప్రైజ్ గిఫ్ట్​ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral News)​గా మారింది.

నేటి యువత వివాహ వేడుకలకు(Wedding Celebration) ఎంతటి ఖర్చు చేయడానికైన తగ్గట్లేదు. తమ వివాహ వేడుక కలకాలం గుర్తుండిపోయే విధంగా సరికొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వేడుక వరకు ప్రతి ఒక్క కార్యక్రమం పక్కాగా ప్లాన్ వేసుకుని జరుపుకుంటున్నారు. దీని కోసం యువత.. వెడ్డింగ్​ ఆర్గనైజర్లను కూడా సంప్రదిస్తున్నారు.

సాధారణంగా యువత.. తమకు కాబోయే ఫియాన్సీకి రకరకాల గిఫ్ట్​లను ఇచ్చి సర్​ప్రైజ్ చేస్తుంటారు. గిఫ్టులను ఇచ్చి వారిపై ఉన్న తమ ప్రేమను చాటుకుంటారు. సాధారణంగా మనం .. నేటి యువత గోల్డ్, డైమండ్, ప్లాటీనంతో తయారు చేసిన రకరకాల ఆభరణాలను గిఫ్ట్​ లుగా ఇస్తుంటారు. అయితే, వడోదరకు (Vadodara Business man) కు చెందిన 25 ఏళ్ల యువ ఇంజనీర్ వినూత్నంగా ఆలోచించాడు. తనకు కాబోయే ఫియాన్సీకి ఎవరు కూడా ఊహించని ఒక కానుకను ఇచ్చాడు. ప్రస్తుతం అది వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్​లోని వడోదరకు చెందిన మయుర్ ​పాటిల్ కు, హేమలీ పాటేల్​లు గత రెండేళ్లుడా ప్రేమించుకుంటున్నారు. మయర్​ ఇంజనీర్​కాగా, హేమాలీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే, వీరి ప్రేమకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకేముంది.. పెళ్లి వేడుక తరవాయి. అయితే, తనకు కాబోయే భార్యకు మయుర్​ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ​ఇవ్వాలను కున్నాడు. దానికోసం తన మిత్రులతో చర్చించాడు. వారు బంగారం, ప్లాటినం ఇవ్వాలని సలహ ఇచ్చారు. ఇవన్ని చాలా రోటిన్ గా జరిగేవనిన మయుర్ భావించాడు. ఇక దీనికోసం ఇంటర్నేట్​లో కూడా సెర్చ్​చేశాడు. చివరకు మయుర్ పాటేల్ ఒక ఐడియా తట్టింది.

తన భార్యకు చంద్రుడి మీద స్థలం కొంటే (Land On Moon) ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఐడియా వచ్చిన వెంటనే ఇంటర్నేషనల్​ లూనార్​ లాండ్​ రిజిస్ట్రి అండ్ యూఎస్​బెస్​డ్​ ఆర్గనైజేషన్​ను వారిని సంప్రదించాడు. ​ఆ తర్వాత.. తనకు కాబోయే భార్య పేరు మీద చంద్ర మండలం కొంత స్థలం కొనుగోలు చేశాడు. దానికోసం కావాల్సిన రిజిస్ట్రేషన్ ను కూడా పూర్తి చేశాడు.

గత ఆదివారం వడోదరలో పెళ్లి కార్యక్రమం వైభవంగా జరిగింది. దీంట్లో బంధువులు, స్నేహితుల సమక్షంలో వరుడు, తన భార్యకు చంద్రుడిపై రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఫోటోఫ్రేమ్ ను ఆమె చేతిలో పెట్టాడు. దీన్ని చూసిన ఆమె నోట్లో మాట రాలేదు. కళ్ల నిండా నీళ్లు తిరిగాయి.

తన భర్త చూపిస్తున్న ప్రేమను చూసి ఆనందంతో పొంగిపోయింది. ప్రస్తుతం ఈ సర్ ప్రైజ్​ గిఫ్ట్ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నువ్వు చాలా లక్కీ.. ’, ‘ నిజంగా ఎవరు ఎక్స్​పెక్ట్ చేయని ఐడియా..’,‘నువ్వు సూపర్ బ్రో..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

First published:

Tags: Gifts, Gujarat, Gujarat news, Land registration, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు