హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

TV, Phones Shut Down: ఆ ఊర్లో రాత్రి 7 నుంచి 8.30 వరకు టీవీలు, ఫోన్లు బంద్‌.. కారణం మంచిదే..!

TV, Phones Shut Down: ఆ ఊర్లో రాత్రి 7 నుంచి 8.30 వరకు టీవీలు, ఫోన్లు బంద్‌.. కారణం మంచిదే..!

 TV, Phones Shut Down: ఆ ఊర్లో రాత్రి 7 నుంచి 8.30 వరకు టీవీలు, ఫోన్లు బంద్‌.. కారణం మంచిదే..!

TV, Phones Shut Down: ఆ ఊర్లో రాత్రి 7 నుంచి 8.30 వరకు టీవీలు, ఫోన్లు బంద్‌.. కారణం మంచిదే..!

TV, Phones Shut Down: సాధారణంగానే ఎక్కువ ఇళ్లలో సాయంత్రం 7 గంటలకు టీవీలో సీరియళ్లు మొదలవుతాయి. పిల్లల చేతుల్లోకి మొబైల్‌ ఫోన్లు చేరుతాయి. కానీ, ఆ ఊర్లో మాత్రం సీన్ అంతా రివర్స్.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో టీవీ (TV), స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) లేని ఇల్లు దాదాపుగా లేదని చెప్పవచ్చు. అయితే స్కూల్ స్టూడెంట్స్(Students) సాయంత్రం ఇళ్లకు వచ్చాక.. టీవీ లేదా ఫోన్‌కు అతుక్కుపోతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ప్రత్యేకంగా చదివించినా, ఇంట్లో టీవీ, ఫోన్లను ఇతరులు వాడితే చదువుకు ఆటంకంగా మారుతాయి. దీంతో పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. ఈ సమస్య దాదాపు అన్ని ఇళ్లలో ఉండేదే. దీనికి పరిష్కారం ఎలా అని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటుంటారు. అయితే ఈ సమస్యకు ఓ గ్రామం పరిష్కారం చూపింది. ఆ పరిష్కారం ఏంటి? పిల్లలు ప్రయోజనం పొందారా? లేదా? చూద్దాం.

* రాత్రి 7 అయితే టీవీలు, ఫోన్లు ఆఫ్‌

పిల్లల దృష్టి చదువుపై ఉండేలా చేయడం ఎలా? అనే ప్రశ్న మహారాష్ట్ర , సాంగ్లీ జిల్లాలోని కడేగావ్ తాలూకా మోహిత్యాలోని వడ్‌గావ్ గ్రామ వాసులను కూడా తలెత్తింది. ఈ గ్రామస్థులు అంతా కలిసి పిల్లల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు టీవీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అందరూ పాటించేలా గ్రామంలోని ఆలయంపై మైక్‌సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

సాధారణంగానే ఎక్కువ ఇళ్లలో సాయంత్రం 7 గంటలకు టీవీలో సీరియళ్లు మొదలవుతాయి. పిల్లల చేతుల్లోకి మొబైల్‌ ఫోన్లు చేరుతాయి. ఈ ప్రభావం నేరుగా పిల్లల చదువులపై కనిపిస్తుంది. అందుకే వడ్‌గావ్‌ గ్రామంలో అందరూ కలిసి ఈ సమస్యపై చర్చించారు. ఆ ఊరిలో మొత్తం జనాభా 3,105. అందరూ కలిసి రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు టీవీలు, ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు.

* నిర్ణయం సక్సెస్

కరోనా కాలంలో, పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా మొబైల్ ఫోన్లు ఇచ్చారు. దీని వల్ల పిల్లలు ఫోన్లకు బానిసలయ్యారు. కాబట్టి వడ్‌గావ్‌ గ్రామ సర్పంచ్ మోహిత్య తీసుకున్న ఈ నిర్ణయానికి సపోర్ట్‌ చేశామని చెబుతున్నారు అంగన్‌వాడీ కార్యకర్త సువర్ణ జాదవ్. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు అవుతోందన్నారు. ఇంటింటికి వెళ్లి చూస్తే అందరు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి : ఇంత రిస్క్ అవసరమా భయ్యా.. ఐఫోన్ ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు కార్ యాక్సిడెంట్ చేసిన యూట్యూబర్..

* తల్లిండ్రుల సంతోషం

ఓ విద్యార్థి దీని గురించి మాట్లాడుతూ.. ‘స్కూల్ అయ్యాక కొంచెం సేపు ఆడుకుంటాం. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు, తల్లిదండ్రులు ఇంట్లో టీవీ, మొబైల్ ఫోన్‌లను ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చదువుకోవడం సరదాగా ఉంది. మొదట్లో టీవీ చూస్తూ చదువుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మేం క్రమశిక్షణతో ఉన్నాం.’ అని చెప్పాడు.

ఈ కార్యక్రమాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు గ్రామ పంచాయతీ సమీపంలోని ఆలయంపై మైక్‌సెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 130 మంది, ఉన్నత పాఠశాలలో 450 మంది పిల్లలు చదువుతున్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సభ్యులు గ్రామంలో రాత్రి 7 నుంచి 8:30 గంటల మధ్య పిల్లలు ఇంటి బయట కనిపించకుండా చూసేవారు. ఎవ్వరూ టీవీ పెట్టకుండా చూసేవారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: EDUCATION, Smartphones, Tvs, VIRAL NEWS

ఉత్తమ కథలు