హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా... 21 మందికి తీవ్ర గాయాలు..

యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా... 21 మందికి తీవ్ర గాయాలు..

బోల్తా పడిన బస్సు

బోల్తా పడిన బస్సు

Uttarakhand: కేదార్‌నాథ్ నుండి హరిద్వార్ వెళ్తున్న బస్సు కౌడియాల దగ్గర బోల్తా పడింది. దీంతో అధికారులు హుటా హుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఉత్తరాఖండ్‌లో (Uttarakhand)  ఘెర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవప్రయాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌడియాల సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరగ్గానే.. ప్రయాణికులు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ లను అక్కడికి తరలించారు.

ఇద్దరు పిల్లలతో సహా 33 మంది ప్రయాణికులతో కేదార్‌నాథ్ నుంచి హరిద్వార్ కు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా .. గాయపడిన 21 మందిని రిషికేశ్‌ లోని ఆస్పత్రులకు తరలించారు. యాత్రికులంతా.. అందరూ మహారాష్ట్రకు చెందినవారని SDRF కె సజ్వాన్ అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా.. డ్రైవర్ మత్తు పదార్థం తీసుకున్నాడా.. లేదా నిద్రమత్తులో ఇలా జరిగిందా.. మరేదైన కారణం ఉందా అన్న కోణంలో అధికారులు ఎంక్వైరీ చేపట్టారు.

ఇదిలా ఉండగా  కొంత మంది పోలీసులు (Police) కఠినంగా ప్రవర్తిస్తుంటారు. ఖాకీ ఉద్యోగం రాగానే.. ఏదో ఫీల్ అవుతుంటారు. ఇతరుల మీద అజమాయిషీ చేస్తుంటారు. తమ అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది ఇలాంటి పనులు చేయడం వలన డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డపేరు ఆపాదించబడుతుంది. ఈ కోవకు చెందిన అనేక ఘటనలు ఇప్పటికే వార్తలలో నిలిచాయి. మరోక ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అస్సాంలో (Assam)  షాకింగ్ ఘటన జరిగింది. కొంత మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. కర్బీ అంగ్లాంగ్‌లోని ఓ వీధిలో ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ను ఇష్టమోచ్చినట్లు కొట్టారు. స్థానికులు కల్గచేసుకుని ఆపడానికి ప్రయత్నించిన వారుపట్టించుకోలేదు. ఆటో డ్రైవర్ ను కాలితో తన్నుతూ.. కొట్టడం చేస్తున్నారు. కేవలం ఆటోను ఆపమంటే... వెళ్లినందుకు ఇలా దాడిచేసినట్లు స్థానికులు తెలిపారు. బొకాజన్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video)  మారింది. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.ఘటనపై విచారణకు ఆదేశించారు. వీడియోలో, బాధితుడు, ఎర్రటి టీ-షర్టు, నల్లని షార్ట్ ధరించి, అతనిపై దాడి చేయడానికి వంతులవారీగా ఇద్దరు పోలీసులు పట్టుకున్నట్లు కనిపిస్తోంది.

First published:

Tags: Bus accident, Uttarakhand

ఉత్తమ కథలు