వివాహాలు జరుగుతున్న సందర్భాల్లో కొన్నిసార్లు చిన్నపాటి గొడవలు తలెత్తుతుంటాయి. సాధారణంగా బంధువుల మధ్య వివాదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి తరుణంలో చాలాసార్లు విషయాలు సర్దుకొని ఇరువైపుల వారు శాంతిస్తారు. మరికొన్ని సార్లు వివాదం పెద్దదవుతుంది. అయితే ఇటీవలి కాలంలో వరుడు, వధువు మధ్యే గొడవలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోనూ ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ నవ వధువు.. పెళ్లి కొడుకును చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. పెళ్లయ్యాక అత్తారింట్లోకి వెళ్లేందుకు కారు దిగిన వెంటనే వరుడి చెంపచెళ్లుమనిపించింది ఆ అమ్మాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి దుస్తులు మార్చేసి.. మామూలు డ్రెస్ వేసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. జౌన్పూర్ జిల్లా లవాయన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.ఇక ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పంచాయితీ పోలీసుల దగ్గరికి వెళ్లింది. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే పెళ్లికి ముందు వరుడి ప్రేమ వ్యవహారం నడిచిందని, అది తెలిసిన పెళ్లి కూతురు అతడిని కొట్టినట్టు ప్రాథమిక విచారణతో తేలిందని పోలీసులు చెప్పారు. రిసెప్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ వివాదం తలెత్తిందని వెల్లడించారు. ఇక వరుడిని వధువు కొట్టిందన్న వార్త దావానలంలా వ్యాపించింది.
పెళ్లి కోసం వరుడి ఇంటికి పెళ్లి కూతురు బృందం వచ్చిన సమయంలో ఎలాంటి గొడవ జరగలేదు. పెళ్లి కూడా ఎంతో ప్రశాంతంగా జరిగింది. అప్పటి వరకు అమ్మాయితో వరుడు ఏం చెప్పలేదు. ఆ తర్వాత అప్పగింతల సమయంలో ఈ తతంగం జరిగింది. కొత్త పెళ్లి కూతురు.. వరుడిని కొట్టింది. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Marriage, Uttar pradesh, VIRAL NEWS, Wedding