హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘అట్లుంటదీ మరీ నాతోనీ..’.. యువకుడి సీన్ సీతార్ చేసిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

‘అట్లుంటదీ మరీ నాతోనీ..’.. యువకుడి సీన్ సీతార్ చేసిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

యువకుడిని కొడుతున్న అమ్మాయి

యువకుడిని కొడుతున్న అమ్మాయి

Uttar Pradesh: యువకుడు మద్యం మత్తులో అమ్మాయిని వేధించాడు. ఎన్నిసార్లు చెప్పిన వదలిపెట్టలేదు. దీంతో ఆమె తనకు తెలిసిన వారందరిని పిలిపించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

మహిళలు సింగిల్ గా కన్పిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతుంటారు. ఏదో ఒక వంకతో యువతులను గెలకడానికి ట్రైచేస్తుంటారు. వాళ్లను టీజ్ చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. బస్టాండ్ లో, రైల్వేస్టేషన్, ఉద్యోగాలు చేసే చోట కూడా ఇలాంటి కామాంధులు ఉంటారు. వీరు మహిళలను టార్గెట్ గా చేసుకుని వేధిస్తుంటారు. కొన్నిసార్లు మంచిగా ఉన్నట్లు నటిస్తారు. ఆ తర్వాత అసలు రంగు బయటపెడుతుంటారు. మరికొందరు తాగి మహిళల పట్ల ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మహిళలను, అమ్మాయిలను అత్యాచారాలు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన జరిగింది. జలౌన్ జిల్లాలోని ఒరాయ్ నగరంలో ఒక యువతిని తాగుబోతు వేధించాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తాగిన మైకంలో యువతిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. దీంతో యువతి ఎంత చెప్పిన అతను వినలేడు. దీంతో ఆమె తనకు తెలిసిన వారిని రప్పించింది. కామాంధుడిని అందరిముందే రోడ్డు మీద కూర్చోబెట్టింది. అంతే కాకుండా.. అతడిని చెప్పుతో చితక్కొట్టింది.

దాదాపు.. 20 సెకన్లపాటు.. 40 సార్లు తలపై చెప్పుతో కసితిరా బాదింది. దీంతో అక్కడున్న వారంతా భలే కొడుతుందే అంటూ ఇంట్రెస్టింగ్ గా చూశారు. ఎవరు కూడా యువతిని ఆపే సాహాసం మాత్రం చేయడం లేదు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. భలే కొడుతుంది.. ఇంకొసారి ఏవడు అమ్మాయిల జోలికిపోడు ఈ వీడియో చూస్తే అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు