Home /News /trending /

UTTAR PRADESH VIRAL VIDEO SHOWS TEACHER ENTERING FLOODED SCHOOL STUDENTS HOLD CHAIRS PAH

హ్యాట్సాఫ్.. టీచర్ క్లాస్ కు రావడానికి విద్యార్థుల పాట్లు... నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

క్లాస్ కు వస్తున్న టీచర్

క్లాస్ కు వస్తున్న టీచర్

Uttar Pradesh: కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. స్కూల్ ప్రాంగణమంతా వరద నీటితో నిండిపోయింది. ఈ క్రమంలో తమ టీచర్ క్లాస్ కు రావడానికి స్టూడెంట్స్ చేసిన పని వైరల్ గా మారింది.

కొన్నిరోజులుగా భారీ వర్షం (Heavy rain)  కురుస్తోంది. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లు కుండపోతగా వాన పడుతుంది. సామాన్య జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు కూడా నిండుకుండలా కన్పిస్తున్నాయి. జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్లు స్కూళ్లలో, ఇళ్లలోనికి, లోతట్లు ప్రాంతాలలోకి భారీగా నీరు వచ్చి చేరింది. అనేక చోట్ల ప్రజలు.. ఆస్తిని నష్టపోయారు. అయితే, కొన్ని చోట్ల వరదలలోనే ప్రజలు నెమ్మదిగా కార్యకలాపాలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా (viral video) మారుతున్నాయి. మరోక ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని  (Uttar pradesh) మధుర జిల్లాలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న పాఠశాలలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. స్కూల్ ఆవరణలో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో.. టీచర్ తమ స్కూల్ లోపలికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది. అప్పుడు విద్యార్థులంతా ఒక ఐడియా వేశారు.





క్లాస్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్లాస్టిక్ చేయిర్ లను తీసుకొచ్చారు. వాటిని విద్యార్థులంతా కలసి వరుసగా పెట్టారు. దానిపైన ఎక్కి టీచర్ ను క్లాస్ కు రమ్మన్నారు. అప్పుడు టీచర్ కుర్చీ మీద ఎక్కి ఒక్కొ.. కుర్చీ దాటుకుంటూ తరగతి గదికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. విద్యార్థుల ఐడియా భలే ఉందంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ లోనే మసాజ్ చేయించుకుంది.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్(Viral)అవుతోంది. టీచర్ ఉద్యోగానికి ఎసరపెట్టింది.నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్‌ పదేళ్ల స్టూడెంట్‌తో చేతుల నొక్కించుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

హర్దోయ్ జిల్లాలోని వికాస్ఖండ్ బవాన్‌లోని పోఖారీ అనే ప్రాథమిక పాఠశాలలో ఊర్మిళా సింగ్‌ అనే ఉపాధ్యాయురాలు అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. క్లాస్‌ రూమ్‌కి పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్..ఎంతో సరదాగా..దర్జాగా కుర్చిలో కూర్చొని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని ...విద్యార్ధితో తన చేతులు నొక్కించుకుంది.

మిగిలిన విద్యార్ధులు తరగతి గదిలో అల్లరి చేస్తుంటే వాళ్లను అల్లరి చేయవద్దని భయపెడుతూనే స్టూడెంట్‌తో హ్యాండ్ మసాజ్ చేయించుకుంది టీచర్‌. ఒక ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌ని విశ్రాంతి గదిగా మార్చుకొని తాను వెలగబెడుతున్న ఘనకార్యం చూసిన స్కూల్‌ సిబ్బందిలో ఒకరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అమ్మగారి బాగోతం నెట్టింట్లో (Social media)  వైరల్ అవుతోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, School, Uttar pradesh, Viral Video

తదుపరి వార్తలు