Home /News /trending /

UTTAR PRADESH TWO SISTERS POISON FAMILY FOR OBJECTING TO WEDDING WITH THEIR BOYFRIENDS MOTHER INVOLVED IN CRIME PAH

OMG: వామ్మో.. పెళ్లికి నో చెప్పారని అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్.. ఇంటికి దావత్ కు పిలిచి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: తమ పెళ్లికి నో చెప్పారని కోపం పెంచుకున్నారు. ఇంటికి విందు కోసం ఆహ్వనించారు. ఆ తర్వాత.. తియ్యగా మాట్లాడారు.

నచ్చిన వారిని సొంతం చేసుకొవటానికి కొంత మంది ఎంతకైన దిగజారుతున్నారు. కొందరు బలవంతంగా తాళి కట్టించుకుని పెళ్లి (Marriage) చేసుకుంటున్నారు. మరికొందరు పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో వివాహలు చేసుకుంటున్నారు. కొందరు దీనికి భిన్నంగా పెద్దలతో మాట్లాడి, ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఏదోరకంగా తాము ప్రేమించిన వారితో పెళ్లి చేసుకొవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొందరు పెళ్లికి ఒప్పుకోలేదని వారి కుటుంబం మీద పగను కూడా పెంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జునైద్ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజకుమారికి ఇద్దరు కూతుళ్లు. జ్యోతి, అర్చన. వీరిద్దరు బులంద్ షహర్ కు చెందిన అభిషేక్, దీపక్ లను ప్రేమించారు. అయితే , వీరి పెళ్లికి అమ్మాయిల తల్లి అంగీకరించింది. కానీ యువకుల తరపు వారు పెళ్లికి (Wedding) వ్యతిరేకించారు. దీంతో వారు కోపంతో రగిలిపోయారు. ఎలాగైన తన వారి అడ్డు తొలగించుకొవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఒక రోజు రాజకుమారి, వారిని తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరింది. వీరు గ్రామానికి దగ్గరగా ఉండటం వలన తరచుగా కలుస్తు ఉండేవారు.

ఈ క్రమంలో రాజకుమారి ఆహ్వనం మేరకు విందుకు హజరయ్యారు. అయితే, ఆహరంలో తల్లికూతుళ్లు విషం కలిపారు. దీనికి అభిషేక్ కూడా సహకరించాడు. ఆహరం తిన్న కాసేపటికే వీరు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిన చూసిన వైద్యులు వీరు తిన్న ఆహరం పాయిజన్ అయ్యిందని అన్నారు. దీంతో బాధిత బంధువులు, రాజకుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోనికి తీసుకొని విచారించారు. కూతుళ్లతోపాటు, అభిషేక్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

గుజరాత్ లో (Gujarat)  దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది.

నవ్ సారి జిల్లాకు చెందిన ఒక యువతి, కొయంబత్తురుకు చెందిన రాజు పటేల్ కి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి (Affair)  దారితీసింది. ఈ క్రమంలో.. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య గొడవలు జరగటంతో రాజు పటేల్ ను యువతి దూరంగా పెట్టింది. దీంతో అతను కోపంతో రగిలిపోయాడు. కాగా, మింధబారి నగరంలో సదరు యువతి చెల్లెలి పెళ్లి (Marriage)  నిశ్చమైంది. యువతి పెళ్లి.. లతేష్ అనే వ్యక్తితో జరిగింది. కాగా, వీరి పెళ్లికి రాజు పటేల్ కూడా వచ్చాడు.

పెళ్లి తర్వాత.. గిఫ్ట్ లు  (Gift Explosion) ఓపేన్ చేసి చూస్తున్నారు. యువతి,మేనల్లుడు జియాన్ కొత్త జంటలకు వచ్చిన బహుమతులను సరదాగా తెరుస్తున్నాడు. ఒక గిఫ్ట్ లో అతను బొమ్మను చూశాడు. దాని రీచార్జ్ చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అది ఒక్కసారిగా పేలింది. దీంతో జియాన్, లతేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు కాసేపటికి పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. బహుమతి కవర్ ను రాజు పటేల్ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ యువతి పై కోపంతోనే చెల్లెలి పెళ్లిలో ఇలా చేసుంటాడని భావిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, Uttar pradesh, Wedding

తదుపరి వార్తలు