కొంత మంది ఉపాధ్యాయులు (Teacher) విద్యార్థుల పట్ల ఎంతో ఓపికతో ఉంటారు. వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతారు. విద్యార్థులు చెప్పింది వింటారు. ప్రతి నిముషం విద్యార్థుల కోసం పరితపిస్తుంటారు. విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. తమ విద్యార్థులను ఎప్పుడు ప్రొత్సహిస్తూ.. వారిలోని ట్యాలెంట్ ను గుర్తించి మరింత ఉత్సాహపరుస్తారు. అయితే, మరికొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కేవలం జీతాల కోసం మాత్రమే పనిచేస్తారు.
తమ ఉద్యోగానికి మచ్చ తీసుకోచ్చేలా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్థులను వేధిస్తుంటారు. లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. ఎక్కువ మార్కులు వేస్తామని, అమాయక విద్యార్థులను లోబర్చుకుంటారు. మరికొందరు ప్రతిదానికి కోపగించుకుంటారు. విద్యార్థులను ఇష్టమోచ్చినట్లు చితక బాదుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Unnao: FIR registered against this teacher under stringent sections after video of her beating a child student goes viral; Head Master also dismissed from job for not taking any action after report. pic.twitter.com/e7YlhzMPvm
— सत्येन्द्र तिवारी (प्रतापगढ़ी)....✍️ (@Pratapgarhi_) July 13, 2022
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఉన్నావ్ లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అసోహా బ్లాక్‌లోని ఇస్లాం నగర్ ప్రాథమిక పాఠశాలలో ఒక బాలిక తోటి విద్యార్థులతో తరగతి గదిలో కాస్త అల్లరి చేసింది. దీంతో టీచర్ సునీల్ కుమారి రెచ్చిపోయింది. బాలికను చితక బాదింది. జుట్టుపట్టుకొని లాగి అమానుషంగా ప్రవర్తించింది. బాలిక ఏడుస్తున్న, ఉపాధ్యాయురాలు ఏమాత్రం జాలీ చూపలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (social media) ప్రత్యక్షమైంది. ఇది కాస్త వైరల్ గా (viral video) మారింది. అధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయురాలు, సునీల్ కుమారిని సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో ఒక కుక్క తన యజమానిపైనే దాడిచేసింది.
లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఖైసర్ బాగ్ లో 82 ఏళ్ల సుశీలా త్రిపాఠి తన ఇంట్లో అరుదైన కుక్క పిట్ బుల్ ను (Pet dog) పెంచుకుంటుంది. ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్. అయితే, మంగళవారం.. ఆమె తన ఇంట్లో పైకప్పు మీదకి ఎక్కింది. ఇంతలో ఏమైందో ఏమో.. అక్కడికి పిట్ బుల్ కుక్క వెళ్లింది. అది.. వృద్ధురాలిని ఇష్టమోచ్చినట్లు గాయపరిచింది. అయితే.. కాసేటికి రక్తపు మడుగులో ఉన్న సుశీలాను పనివాళ్లు గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేశారు. కాగా, పిట్ బుల్ (Pit bull dog) అనేది అరుదైన జాతి కుక్కగా పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Teacher misbehave, Uttar pradesh, Viral Video