ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులంతా కఠినంగా ఉండరు. వాళ్లలో కూడా మాటల్లో చెప్పలేనంత మానవత్వం, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునే సహాయగుణం ఉంటుంది. ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో జరిగిన ఓ సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. వారణాసి (Varanasi)చెత్‌గంజ్ ప్రాంతంలో ఓ శిథిలావస్థలో ఉన్న భవనం గోడ కూలి అక్కడ పని చేస్తున్న ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ఇద్దరిలో ఒకరు స్పాట్‌లో చనిపోగా.మరొకరు తీవ్రంగా గాయపడి ఊపిరి అందక విగతజీవిగా పడి ఉండటం అక్కడే ఉన్న ఎస్‌ఐ శశి ప్రతాప్ (Shashi Prathap)గమనించాడు. వెంటనే గాయపడిన కార్మికుడ్ని బ్రతికించడానికి తన నోటితో క్షతగాత్రుడి నోటిలోకి గాలిని పంపాడు. అదే విధంగా పలుమార్లు చేసి..ఛాతిపై నొక్కుతూ ఊపిరి ఆడే విధంగా సీపీఆర్ (CPR) చేశాడు. అప్పటికప్పుడు అతనికి ఆక్సిజన్ అందించి బ్రతికించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఎస్‌ఐ ఓ కూలీ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది.
ఊపిరి పోసినా బ్రతకలేదు..
ప్రాణం ఎవరిదైనా ఒకటి. కళ్ల ముందే చనిపోతే ఎవరు చూస్తూ ఉండలేదు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో శిథిలావస్థలో ఉన్న భవనం గోడ కూలి కూలీ గాయపడ్డాడు. చెత్‌గంజ్ ప్రాంతంలోని బాగ్ బరియార్‌సింగ్ కాలనీలో ఇంటి నిర్మాణం జరుగుతుండగా గోడ కూలి పనులు చేస్తున్న కార్మికులపై పడింది. ఈదుర్ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న చెట్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ అనంత్ మిశ్రా, శశిప్రతాప్ అనే ఇద్దరు చేరుకున్నారు. గాయపడిన కూలీ ఊపిరి అందక విగతజీవిగా పడి ఉండటంతో ..అనంత్ మిశ్రా ఆ కూలీని రక్షించేందుకు తన నోటితో గాలిని అతని నోటి ద్వారా పంపే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న మరో పోలీస్ శశి ప్రతాప్ గాయపడిన కూలీ ఛాతి నొక్కుతూ హార్ట్ బీటింగ్ పని చేసేలా ప్రయత్నించాడు. కొద్దిసేపటికి గాయపడిన వ్యక్తికి ఊపిరి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
పోలీసుల మానవత్వం..
ఇద్దరు పోలీసులు ఓ కూలీ ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించడం చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అంతే కాదు తమ దగ్గరున్న సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే వీడియో కాస్తా వైరల్ అయింది. నోటితో శ్వాస అందించి ఓ కూలీని కాపాడేందుకు పోలీసు సిబ్బంది చూపించిన చొరవను ప్రజలు హర్షిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో..
పాత ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. చనిపోయిన కూలీల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుని భార్య గాయత్రీ దేవి కూలిపోయిన ఇంటి యజమాని తారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video