మనలో చాలా మందికి కొన్నిరకాల భయాలు ఉంటాయి. కొందరికి నీళ్లంటే భయపడుతుంటారు. మరికొందరు.. చీకటిని చూసి భయపడిపోతుంటారు. పాములు, కుక్కలు, ఇలా రకరకాల మనుషులు ఏదో ఒక రకమైన భయాలను కల్గి ఉంటారు. కొంత మంది డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయపడుతుంటారు. ట్రీట్ మెంట్ చేసుకొవడానికి తెగ వణికిపోతుంటారు. దీంతో కనీసం డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి అవాయిడ్ చేస్తు ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral video) మారింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఫన్నీ సంఘటన జరిగింది. ఉన్నావ్ లో కొంత మంది పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఎప్పటి కప్పుడు ఉద్యోగుల హెల్త్ చెకప్ చేస్తుండేవారు. ఈ క్రమంలో... అందరి బ్లడ్ శాంపుల్స్ ను తీసుకుంటున్నారు. అప్పుడు ఒక పోలీసు.. రక్తం శాంపుల్స్ తీయడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. తోటి ఉద్యోగులు.. అతడిని ఏంకాదని సముదాయిస్తున్నారు. అయిన కూడా.. అతను ఏ మాత్రం పట్టించుకొవడం లేదు. చిన్న పిల్లాడిలా ఒకటే భయపడిపోయాడు.
View this post on Instagram
ఏడ్వడం కూడా మొదలెట్టేశాడు. చివరకు ఏలాగోలా కూర్చోబెట్టి అతని దగ్గర నుంచి శాంపుల్ ను స్వీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. చిన్న పిల్లాడిలా ఏంటని నవ్వుకుంటున్నారు. మరికొందరు.. పాపం.. తెగ భయపడిపోయాడని కామెంట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా కారు డ్రైవర్ అజాగ్రత్త స్కూటీ డ్రైవర్ ప్రాణాల మీదకు వచ్చిపడింది.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) కళ్లముందే షాకింగ్ ఘటన జరిగింది. లక్నో లోని అలంబాగ్ ప్రాంతంలోని ఛోటాబర్హా ప్రాంతంలో గతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గత గురువారం నాడు.. అనిల్ గౌతమ్ అనే వ్యక్తి తన పనుల స్కూటీ మీద వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డు పక్కన ఒక కారు పార్కింగ్ చేసి ఉంది. అయితే.. అతను కారుకు కుడివైపుల డోర్ ను సడెన్ గా తీశాడు.
అప్పుడు వెనుక నుంచి స్కూటీ మీద అనిల్ వస్తున్నాడు. దీంతో స్పీడ్ మీద ఉన్న అతను.. కారు డోర్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డాడు. అతనికి హెల్మెట్ కూడా పక్కకు వెళ్లి పడింది. వెంటనే అక్కడున్న వారు... అతడిని లేపడానికి ప్రయత్నించారు. కానీ అనిల్ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు.
అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతు అనిల్ గురువారం ఉదయం చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పవిచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video