• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • UTTAR PRADESH PANCHAYAT HOLDS LUCKY DRAW TO PICK HUSBAND FOR WOMAN WHO ELOPED WITH FOUR MEN SU

నలుగురు యువకులతో ప్రేమ.. వారితో కలిసి పారిపోయిన యువతి.. పంచాయతీ పెద్దలు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

నలుగురు యువకులతో ప్రేమ.. వారితో కలిసి పారిపోయిన యువతి.. పంచాయతీ పెద్దలు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతి నలుగురు యువకులతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

  • Share this:
    ఓ యువతి నలుగురు యువకులతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె నలుగురితో ప్రేమలో ఉండటంతో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిపై నిర్ణయానికి రాలేకపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పంచాయతీ పెద్దలు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ వింత ఘటనకు ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ ప్రజలు సాక్ష్యంగా నిలిచారు. వివరాలు.. టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతి. అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న నలుగురు యువకులతో కలిసి పారిపోయింది. వీరు ఆ నలుగురు యువకుల్లోని ఒకరి బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు.ఇక, యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే ఆమె నలుగురు యువకులతో కలిసి వెళ్లిందని తెలుసుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చూశారు. అయితే స్థానికులు వారి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని.. పంచాయతీ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

    ఈ క్రమంలోనే పంచాయతీ పెద్దలు నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్‌ను యువతి ముందు ఉంచారు. అయితే దానిపై యువతి ఓ నిర్ణయానికి రాలేకపోయింది. తాను ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నానో తెలియడం లేదని చెప్పింది. మరోవైపు నలుగురు యువకులు ఎవరూ కూడా బాలికను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.

    ఈ క్రమంలో సమస్యను పరిష్కరించడానికి పంచాయతీ పెద్దలు డ్రా ద్వారా వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నలుగురు యువకుల పేర్లను చీటీల్లో రాసి ఒక గిన్నెలో వేశారు. అందులో నుంచి ఓ చీటీని తీసి.. అందులో ఉన్న యువకుడిని పెళ్లాడాలని చెప్పారు. దీంతో ఆ చీటీలో పేరు ఉన్న యువకుడితో.. యువతి వివాహం త్వరలోనే జరగనుంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు