Home /News /trending /

UTTAR PRADESH ON DUTY DRIVER OF PRATAPGARH KANPUR INTERCITY EXPRESS TRAIN DIES OF CARDIAC ARREST PAH

Railway: జర్నీలో విషాదం.. రైలు నడుపు తుండగా డ్యూటీ డ్రైవర్ కు గుండెపోటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: ప్రతాప్‌గఢ్-కాన్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అందులో ఉన్న అసిస్టెంట్ పైలట్ రైలును ఆపి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు.

మనం తరచుగా నడుస్తున్న బస్సులో డ్రైవర్ లకు గుండెపోటు వచ్చిన అనేక ఘటనలు చూశాం. ఈ క్రమంలో కొంత మంది డ్రైవర్ లు చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. తాము.. ప్రమాదంలో ఉన్నప్పటికి ఇతరులు ప్రమాదంలో పడకుండా చూస్తుంటారు. బస్సును రోడ్డుకి ఒక పక్కన తీసుకెళతారు. కొన్ని సార్లు.. అనుకొని విధంగా డ్రైవర్ లో స్ట్రోక్ కు (Cardiac arrest)  గురై నడిరోడ్డు మీద బస్సులను ఆపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక ఘటనలు మనం చూశాం. ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ లో డ్యూటీ డ్రైవర్ కు స్ట్రోక్ వచ్చింది.

పూర్తి వివరాలు.. యూపీలో (Uttar pradesh) శుక్రవారం విషాదకర ఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్-కాన్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును హరిశ్చంద్ర శర్మ (46) నడుపుతున్నారు. ఈ క్రమంలో.. హరిశ్చంద్ర శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అతని పక్కన మరో అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు. అతన వెంటనే.. ట్రైన్ ను ఆపివేసి.. అధికారులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి అంబులెన్స్ చేరుకుంది. ట్రైన్ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు.అప్పటికే డ్రైవర్ గుండెపోటుతో (Heart attack)  చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కాగా, పరశురాంపూర్ చిల్బిలాకు చెందిన రైలు డ్రైవర్ హరిశ్చంద్ర శర్మ (46) కాన్పూర్ వైపు రైలును నడుపుతుండగా కాసింపూర్ హాల్ట్ సమీపంలో అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య ఏర్పడిందని గౌరీగంజ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. ప్రతాప్‌గఢ్‌ నుంచి మరో లోకో పైలట్‌ రావడంతో రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిందని సింగ్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఫుర్సత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ సోంకర్ తెలిపారు.

ఇదిలా ఉండగా ఒక వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్(Murshidabad)లో ఓ వ్యక్తి..తన భార్య జుట్టు కత్తిరించి ఆమెకు షేవింగ్ చేశాడు. దీనికి కారణం ఆమె ఆడపిల్లకు(Girl Chid)జన్మనివ్వడమే. ముర్షిదాబాద్‌లోని హరిహరపరాలోని సాలూవా గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముర్షిదాబాద్ లోని సాలువా గ్రామంలో నివసించే రకియా-అబ్దుల్లా షేక్ భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రకియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే తాము మగపిల్లవాడు పుట్టాలని అనుకుంటే ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో రకియాను భర్త,అత్తమామలు మానసికంగా వేధించేవాళ్లు. పుట్టేది ఆడో,మగో తన చేతుల్లో ఎలా ఉంటుందని రకియా చెప్పినా వినకుండా ఆమెను మానసికంగా తీవ్ర వేధనకు గురిచేశారు. రకియాను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. పుట్టిన ఆడబిడ్డను చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో గురువారం ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు రకియాను ఆమె భర్త అబ్దుల్లా షేక్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత రకియాను తలపై కాల్చి వివస్త్రను చేశాడు.

అబ్దుల్లా తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండగా, రాకియా మామ, అత్తగారు ఆ దృశ్యాన్ని కళ్లు అప్పగించి చూశారే తప్ప కొడుకుని ఆపే ప్రయత్నం చేయలేదు. రకియా జుట్టు కత్తిరించి,ఆమెకు షేవింగ్ చేశాడు భర్త. ఈ నేపథ్యంలో రకియా పోలీసులను ఆశ్రయించింది. నా భర్తను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ముందు రకియా కేకలు వేసింది. నాకు జరిగినది మరెవరికీ జరగకూడదనుకుంటున్నాను అంటూ భోరున విలపించింది. రకియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త అబ్దుల్లా షేక్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heart Attack, Train, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు