హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : కార్యకర్త ఇంట్లో బస చేసి..సాధారణ సౌకర్యాలు లేని బాత్రామ్ లో మంత్రి స్నానం

Viral Video : కార్యకర్త ఇంట్లో బస చేసి..సాధారణ సౌకర్యాలు లేని బాత్రామ్ లో మంత్రి స్నానం

'చేతి పంపు వద్ద మంత్రి స్నానం

'చేతి పంపు వద్ద మంత్రి స్నానం

Minister Bathing At Supporter Home చాక్ కన్హావు గ్రామాన్ని సందర్శించే సమయానికి ఆయన బాగా అలసిపోయారు. దాంతో అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో విశ్రమించిన ఆయన, మరుసటి రోజు ఉదయం అక్కడ చేతిపంపు వద్ద స్నానం చేశారు. సాధారణ బాత్రూం అయినప్పటికీ ఆయన ఆడంబరాలకు పోకుండా స్నానం ముగించారు.

ఇంకా చదవండి ...

Minister Bathing Video At Supporter Home : ఓ కార్యకర్త నివాసంలో రాత్రిపూట బసచేసి సామాన్యుడిలా చేతి పంపు వద్ద స్నానం చేశారు ఉత్తరప్రదేశ్‌మంత్రి నంద గోపాల్ గుప్తా అలియాస్‌ నంది. చేతి పంపు వద్ద మంత్రి స్నానం చేసిన వీడియోతోపాటు విధులకు రెడీ అవుతున్న మరో క్లిప్‌ను తన ట్విట్టర్‌ ఖాతాలో శుక్రవారం మంత్రి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి వీఐపీ సంస్కృతి లేదని మంత్రి నంద గోపాల్ గుప్తా తెలిపారు. దీనిని తెలియజేసేందుకే ఒక గ్రామస్తుడి ఇంట్లో ఆయన స్నానం చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా నంది ఇటీవల షాజహాన్ పూర్ జిల్లాలో పర్యటించారు. చాక్ కన్హావు గ్రామాన్ని సందర్శించే సమయానికి ఆయన బాగా అలసిపోయారు. దాంతో అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో విశ్రమించిన ఆయన, మరుసటి రోజు ఉదయం అక్కడ చేతిపంపు వద్ద స్నానం చేశారు. సాధారణ బాత్రూం అయినప్పటికీ ఆయన ఆడంబరాలకు పోకుండా స్నానం ముగించారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ, తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతి లేదని, నిరాడంబరతకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి నందగోపాల్ గుప్తానే స్వయంగా పంచుకున్నారు.

"ఉదయం టీతో రోజు ప్రారంభమైంది. షాజహాన్‌ పూర్ జిల్లా సింధౌలీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని చక్ కనాహు గ్రామంలో లీల్‌ రామ్ భార్య సహోదర ఇంట్లో గత రాత్రి బస చేశాను. చేతి పంపులోని నీళ్లతో అక్కడ స్నానం చేశాను" అని మంత్రి నంద గోపాల్ గుప్తా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "యోగి ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే. యోగి ప్రభుత్వం, సామాన్యులకు మధ్య ఎటువంటి దూరం లేదా తేడా లేదు. అలాగే వీఐపీ కల్చర్ కూడా లేదు" అని మరో ట్వీట్‌ చేశారు.అయితే, మంత్రి నందగోపాల్ గుప్తా గతవారం కూడా బరేలీ జిల్లాలో పర్యటించినప్పుడు భరతౌల్ గ్రామంలోని ఓ సామాన్యుడి ఇంట్లో బసచేశారు. అప్పుడు కూడా ఇలాగే చేతి పంపు వద్ద స్నానం చేసిన వీడియోను కూలో షేర్ చేశారు. మంత్రి సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా,గోపాల్‌ బీఎస్పీ, కాంగ్రెస్‌ పూర్వ నాయకుడైన నంద గోపాల్‌ 2017లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా ఉన్నారు.

First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు