కొన్ని సందర్భాలలో పాములు దారితప్పి లేక ఆహారం కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అక్కడ ఎలుకలు, ఇతరు జీవులను తింటుంటాయి. కొన్ని సందర్భాలలో మనుషుల కంట పడతాయి. అప్పుడు అనుకొని సంఘటనలు జరుగుతాయి. కొన్ని సార్లు.. పాముల దగ్గరికి మనం వెళ్లినప్పుడు కాటు వేస్తుంటాయి. మనం ఇలాంటి ఘటనలను పొలంలో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh) లో వింత ఘటన జరిగింది. మఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జర్ నగర్ పరిధిలోని రమేంద్ర యాదవ్ ఇంట్లో ఒక పాము దూరింది. అది అతని భార్యను కాటు వేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. భార్య కేకలు విని రమేంద్ర అక్కడికి చేరుకున్నాడు. వెంటనే తన భార్యను కాటు (Snake bite to wife) వేసిన పామును పట్టుకున్నాడు. దాన్ని ఒక బాటిల్ లో బంధించాడు. ఆ తర్వాత.. తన భార్యను, పాము డబ్బాను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు.. వ్యక్తి చేతిలో ఉన్న డబ్బా చూసి షాక్ కు గురయ్యారు. ఈ డబ్బా ఎందుకు తెచ్చావంటు అడిగారు.
దీంతో అతను ఏ సర్పంకాటు వేసిందని అడిగితే ఏలా.. అందుకే కాటు వేసిన పామును పట్టుకుని చూపించడానికి తెచ్చానంటూ సమాధానం చెప్పాడు. అతని ముందు చూపుకు అక్కడి వారు నోరెళ్ల బెట్టారు. బాధితురాలకి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ (viral news) గా మారింది.
ఇదిలా ఉండగా గుజరాత్ లో (Gujarat) ఈ ఘటన జరిగింది.
వడోదర లోని కలాలీ అనే గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ ఉంది. అక్కడ అనేక చెట్లతో దట్టంగా ఉంది. దీంతో అక్కడ ఒకరకమైన చెట్ల అలజడి విన్పించింది. వెంటనే అక్కడి వారు చెట్ల పొదల్లోకి వెళ్లి చూశారు. అక్కడ భయంకరమైన పాము, ఐదడుగుల కొండ చిలువను మింగేస్తుంది. వెంటనే వారంతా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు. అయితే.. స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకున్నారు. పాము.. కొండ చిలువను సగం వరకు మింగేసింది.
స్నేక్ సొసైటీ వారు ప్రత్యేకంగా ఒక కర్రసహాయంతో పామును, కొండ చిలువను విడదీశారు. ఆ తర్వాత.. వాటిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ క్రమంలో దాన్ని అక్కడే ఉన్న ఒక బ్యాగులో వేశారు. ఆ తర్వాత.. దాన్ని సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. స్నేక్ సొసైటీ వారు పాములను పట్టుకొవడంతో స్థానికులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ సోసైటీవారి ధైర్య సాహాసాలకు వారు కొనియాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake bite, Uttar pradesh, VIRAL NEWS