Home /News /trending /

UTTAR PRADESH MAN COLLIDED WITHCAR ROAD ACCIDENT IN LUCKNOW VIDEO GOES VIRAL PAH

OMG: సడెన్ గా కారు డోర్ తెరిచిన డ్రైవర్.. కళ్ళ ముందే దారుణం.. వీడియో వైరల్..

ఎగిరిపడిన స్కూటీ పై ఉన్న వ్యక్తి

ఎగిరిపడిన స్కూటీ పై ఉన్న వ్యక్తి

Uttar pradesh: రోడ్డుపక్కన కారు పార్కింగ్ చేసి ఉంది. అప్పుడు.. మరో వ్యక్తి స్కూటీ మీద వెనుక వైపు నుంచి వస్తున్నాడు. అప్పుడు కారులోని డ్రైవర్ వెనుక వైపు చూసుకోకుండా ఒక్కసారిగా డోర్ తీశాడు.

కొందరు తమ వాహనాలను అజాగ్రత్తగా నడిపిస్తుంటారు. ట్రాఫిక్ నియమాలను ఏమాత్రం పాటించరు. దీంతో వీరి రాష్ డ్రైవింగ్ వలన ఇతర ప్రయాణికులు ఇబ్బందులలో పడతారు. కొన్ని సార్లు.. ప్రాణాలను కూడా కోల్పోతారు. కొంత మంది తాగి వాహనాలను నడిపిస్తుంటారు. రాంగ్ రూట్ లో తమ వెహికిల్స్ ను పొనిస్తారు. ఇద్దరి కన్నా.. ఎక్కువ మంది వెహికిల్స్ మీద కూర్చుని వాహనాలను నడిపిస్తారు. ట్రాఫిక్ రూల్స్ కు పూర్తిగా భిన్నంగా తమ వాహనాలను నడిపిస్తారు. కొన్ని సార్లు.. వెహికిల్స్ ను ఓవర్ టేక్ చేసే సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలకు చెందిన అనేక వీడియోలు నెట్టింట (Social media) వైరల్ గా (viral video)  మారాయి. మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  కళ్లముందే షాకింగ్ ఘటన జరిగింది. లక్నో లోని అలంబాగ్ ప్రాంతంలోని ఛోటాబర్హా ప్రాంతంలో గతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గత గురువారం నాడు.. అనిల్ గౌతమ్ అనే వ్యక్తి తన పనుల స్కూటీ మీద వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డు పక్కన ఒక కారు పార్కింగ్ చేసి ఉంది. అయితే.. అతను కారుకు కుడివైపుల డోర్ ను సడెన్ గా తీశాడు.

అప్పుడు వెనుక నుంచి స్కూటీ మీద అనిల్ వస్తున్నాడు. దీంతో స్పీడ్ మీద ఉన్న అతను.. కారు డోర్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డాడు. అతనికి హెల్మెట్ కూడా పక్కకు వెళ్లి పడింది. వెంటనే అక్కడున్న వారు... అతడిని లేపడానికి ప్రయత్నించారు. కానీ అనిల్ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు.

అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతు అనిల్ గురువారం ఉదయం చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పవిచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Lucknow, Road accident, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు