పాములంటే చాలా మంది భయంతో వణికి పోతుంటారు. అసలు పాముల పేర్లు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు. పొరపాటున పాము కన్పిస్తే.. ఆ ప్రదేశం దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. కొంత మంది పాములు కన్పిస్తే.. భయంతో పారిపోతుంటారు. మరికొందరు, స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తుంటారు. ఇంకొందరు పాములను పడుతుంటారు. వాటిని ఊరురా తిప్పుతూ, వాటిని ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు.. వారిని పాములు కాటు వేసిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరోక ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాజహాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవెంద్ర మిశ్రా అనే వ్యక్తి పాములను పట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. చుట్టు పక్కల అనేక గ్రామస్థులు ఎక్కడైన పాములు కన్పిస్తే.. ఇతగాడికి సమాచారం ఇస్తారు. అప్పుడు , ఇతను వెంటనే వెళ్లి పాములను పడుతుంటాడు. ఇప్పటికే దేవెంద్ర మిశ్రా వందల పాములను పట్టుకున్నాడు.
ఈ క్రమంలో అతను తాజాగా, ఒక విషపూరిత పాముతో (Snake) ఆడుకున్నాడు. దాన్ని చిన్నారి మెడలో వేసి అందరిని షాకింగ్ కు గురిచేశాడు. ఆ తర్వాత.. అతను పాము కాటుకు గురయ్యాడు. వెంటనే చుట్టు పక్కల వారు అతడిని ఆస్పత్రికి వెళ్లమన్నారు. కానీ అతను వినిపించుకోలేదు. కేవలం తన ఇంట్లో ఉన్న మూలికలను ఉపయోగించాడు. అయితే.. అర్ధరాత్రి అతగాడి ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందిస్తుండగా కొన్ని గంటల తర్వాత.. చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇదిలా ఉండగా ఒక ఇంట్లో రెండు పాములు టెన్షన్ ను పుట్టించాయి.
పూర్తి వివరాలు.. ఒడిషాలోని (Odisha) భయంకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలో ఆరడుగుల పాము.. మరో కొండ చిలువను మింగేసింది. అంతే కాకుండా.. కాసేపు అక్కడ అవి రెండు కూడా పెనుగులాడుకున్నాయి. ఇంతలో పెద్దగా శబ్దం వస్తుండటంతో ఇంట్లోని వారు అక్కడికి వెళ్లి చూశారు.అప్పుడు.. కొబ్రా.. కొండ చిలువున తొలుత మింగేసింది. ఆతర్వాత.. చూస్తుండగానే బయటకు ఉమ్మేసింది. దీన్ని గమనించిన అక్కడి ఇంటి వారు.. స్నేక్ హెల్స్ సొసైటీవారికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పాము అప్పటికే, కొండ చిలువను ఉమ్మివేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది. స్నేక్ హెల్స్ సొసైటీవారు.. పామును బంధించి, దగ్గరలోని అడవిలో వదిలిపెట్టారు. దీన్ని చూడటానికి జనాలు గుంపులు, గుంపులుగా తరలివచ్చారు. పాముల ఫోటోలు తీశారు. అదే విధంగా.. సెల్ఫీలు దిగారు. వీడియోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడిక వీడియో వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake bite, Uttar pradesh