Home /News /trending /

UTTAR PRADESH KANPUR MAN SEEKS LEAVE TO MAKE AMENDS WITH WIFE LETTER GOES VIRAL PAH

నిజంగా.. భార్యంటే ఎంత ప్రేమ.. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను తేవడానికి ఏంచేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: భార్యతో వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య.. మాట మాట పెరిగింది. ఇంతలో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఫోన్ చేసిన ఆన్సర్ చేయడం మానేసింది.

పెళ్లయ్యక భార్యభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు (Family disputes) జరుగుతుంటాయి. అలకలు, చిరుకోపాలు అనేవి కామన్ గా జరుగుతుంటాయి. కొన్నిసార్లు.. వీటిని మెల్లగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. ఇద్దరు పెరిగిన వాతావరణం, ఇంట్లో ఉండే విధానం భిన్నంగా ఉండోచ్చు. అయితే... కొందరు పుట్టింట్లో నడిచినట్లు అత్తగారింట్లో కూడా అలానే ఉండాలని అనుకుంటారు. అప్పుడు గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు.. గొడవలు మొగుడు, పెళ్లాల మధ్యన ఉంటే.. మరికొన్నిసార్లు..పెద్దల మధ్య పంచాయతీ వరకు వెళ్తుంటుంది.

కొందరు.. మాత్రం తమ పరువు పొకూడదని ఇంట్లోనే సమస్యను పరిష్కరించుకుంటారు. కొందరు భార్యలతో సమస్య గురించి చర్చించి పరిష్కరించుకుంటారు. మరికొందరు పరువు పోకూడదని.. తామే సర్దుకుపోయి భార్య చెప్పిందే వింటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) కాన్పూర్ లో వెరైటీ ఘటన వార్తలలో నిలిచింది. శంసాద్ అహ్మద్ అనే క్లర్క్.. తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతను ఎన్నోసార్లు.. భార్యతో ఫోన్ లో మాట్లాడటానికి ట్రైచేశాడు. కానీ ఆమె కాల్ ఆన్సర్ చేయడం మానేసింది. అత్తగారింట్లో వారికి ఏంచెప్పిన వినడం లేదు. అయితే.. తను చేస్తున్న ఉద్యోగంలో ఉన్నఫళంగా లీవ్ అంటే కుదరదు.

అయితే.. పాపం.. శంసాద్ అహ్మద్.. తన పై అధికారికి తన బాధను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో.. ప్రేమ్ నగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బిడిఓ)కి లేఖ రాశారు. దానిలో తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, సర్ది చెప్పి తిరిగి.. తీసుకురావడానికి రెండు రోజుల పాటు సెలవులు కావాలని కోరాడు. దీనిలో క్లియర్ గా తన బాధను క్లర్క్ చెప్పుకున్నాడు. అయితే.. ఈ లేటర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral news) మారింది.

ఇదిలా ఉండగా  బీహర్ లో (Bihar)  దారుణమైన ఘటన జరిగింది.

స్థానికంగా ఉన్న నవ్ గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో దారుణమైన ఉదంతం జరిగింది. జూలై 26 న జరిగిన ఈ అమానవీయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యభర్తలు. అయితే.. వీరితో పాటు.. భర్త సోదరుడు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో ప్రీతి గుప్తా, మరిదితో వివాహేతర సంబంధం (Affair)  పెట్టుకుంది. భర్త ఉద్యోగం మీద వెళ్లగానే ఇద్దరు కలసి గడిపేవారు. అయితే.. తమ గుట్టు ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అనుకుంటూ భయపడేవారు. భర్త అడ్డుతొలగించుకుంటూ.. యథేచ్ఛగా తిరగోచ్చని భావించారు.

అందుకు భార్య ప్రీతి గుప్తా మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను చంపాల్సిందిగా ఒక లక్షరూపాయలను సుపారీగా ఇచ్చింది. దీని కోసం అడ్వాన్స్ గా 20 వేలను కూడా ఇచ్చింది. అయితే.. భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వస్తుండగా కొంత మంది అటకాయించి , పిస్టల్ తో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Family dispute, Uttar pradesh, VIRAL NEWS

తదుపరి వార్తలు