మనలో చాలా మంది పాములంటే భయంతో వణికి పోతుంటారు. అసలు దాని పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. పొరపాటున పాము కన్పిస్తే.. దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. అయితే.. వ్యవసాయం చేసే వారు, గ్రామాలలో ఉండే వారు.. ఎక్కువగా అడవుల దగ్గర నివసిస్తుంటారు. కొన్నిసార్లు.. పాములు, విష కీటకాలు వారి ఇంటికి వస్తుంటారు. రైతులు ఎక్కువగా రాత్రిళ్లు పంట పోలాల దగ్గరకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో పాము కాటుకు గురై మరణిస్తుంటారు.
అదే విధంగా.. మరికొన్ని చోట్ల పాములు పగపట్టాయని భావిస్తుంటారు. కాటు వేసిన వారినే మళ్లి మళ్లి కాటువేయడం, ఒకే కుటుంబానికి చెందిన వారిని కాటు వేయడం వంటి సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన వెలుగులోనికి వచ్చింది. బలరాంపూర్ లోని భవానీపూర్ గ్రామంలో.. అరవింత్ మిశ్రా (38) అనే వ్యక్తి పాముకాటుతో మరణించాడు. గోవింద్ మిషారా (22), చంద్ర శేఖర్ పాండే (22) ఇద్దరు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు అంత్యక్రియలు పూర్తి చేసుకుని రాత్రి , ఇంట్లో అదే గ్రామంలో పడుకున్నారు. అప్పుడు పాము.. ఇద్దరిని కాటు వేసింది. దీంతో చంద్రశేఖర్ పాండే నిద్రలోనే విగత జీవిగా మారాడు. ఆ తర్వాత.. గోవింద్ మిషారాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి కండీషన్ సీరియస్ గా ఉంది.
ఈ క్రమంలో.. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియలకు వచ్చి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న .. వైద్య, పరిపాలన శాఖ ఉన్నతాధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. లోకల్ ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి వారికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శ్రీ శుక్లా స్థానిక అధికారులను కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake, Snake bite, Uttar pradesh