హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గేదెకు గుండు కొట్టించి గ్రామస్థులందరికీ విందు.. వీడియో వైరల్..

గేదెకు గుండు కొట్టించి గ్రామస్థులందరికీ విందు.. వీడియో వైరల్..

గేదెకు గుండుకొట్టిస్తున్న రైతు..

గేదెకు గుండుకొట్టిస్తున్న రైతు..

Viral video: రైతుకు తన గేదె అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో దానికి నున్నగా షేవింగ్ చేసి, గుండు గీయించి గ్రామస్థులకు దావత్ ఇచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొంత మంది మూగ జీవాలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏమైన జరిగితే అసలు భరించలేరు. మనలో చాలా మంది కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలను తమ ఇళ్లలో ఉంచుకుంటారు. వీటిని ఎంతో ప్రేమగాచూసుకుంటారు. అయితే.. ఇక్కడ ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ కు చెందిన ప్రమోద్ అనే  రైతుకూడా తన ఇంట్లో గేదెను ఉంచుకున్నాడు. అదంటే రైతుకు ఎంతో ఇష్టం. అయితే... దానికి ఎన్ని దూడలు పుట్టిన రెండు మూడు నెలల్లోనే చనిపోతున్నాయి. దీంతో అతను ఎంతో బాధపడ్డాడు. తనకు ఇష్టమైన గ్రామంలోని దేవతకు తన బాధను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో గేదె మరోసారి దూడకు జన్మనించింది.

అది ఆరోగ్యంగా ఉండాలని, దానికి ఏంకావద్దని దేవతకు దండంపెట్టుకుని, గేదె తన వెంట్రులకు దూడకు మూడో ఏడాది రాగానే సమర్పిస్తాన మొక్కుకున్నాడు. అయితే... దూడకు ఏం కాలేదు. అది ఆరోగ్యంగానే ఉంది. గ్రామదేవత దయవలనే దూడబతికిందని అనుకున్నాడు. మొక్కుకున్నట్లే గ్రామ దేవత దగ్గరికి గేదెను, దూడను తీసుకొచ్చాడు. అందరి ముందే దానికి గుండు గీయించాడు. ఆ తర్వాత.. అక్కడికి వచ్చిన గ్రామస్థులకు విందుభోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  (Social media) వైరల్ గా (Viral video) మారింది.

ఇదిలా ఉండగా  మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) షాజాపూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది.

స్థానికంగా ఉన్న బడోని స్కూల్ లో ఒక బాలిక బ్యాగులో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో స్కూల్ సిబ్బంది.. స్నేక్ హెల్ప్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. కాగా, బడోని స్కూల్ లో వశిష్ట అనే 10 వ తరగతికి చెందిన విద్యార్థి తన బ్యాగ్ లోపల ఏదో శబ్దం రావడం గమనించింది. వెంటనే బ్యాగులో చూసింది.

ఈ క్రమంలో బ్యాగులో నుంచి పాముతోక కన్పించింది. వెంటనే సిబ్బంది పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల ఆవరణలో బ్యాగును తీసుకెళ్లి చెట్ల మధ్యలో పెట్టారు. అప్పుడు బ్యాగు నుంచి పాము బయట పడింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే అది పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు