హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కోతుల గుంపుతో కోట్లాట..కూతురి కోసం తండ్రిచేసిన ధైర్యానికి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

కోతుల గుంపుతో కోట్లాట..కూతురి కోసం తండ్రిచేసిన ధైర్యానికి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

దాడి చేస్తున్న కోతి

దాడి చేస్తున్న కోతి

Uttar Pradesh: బాలిక ఇంటి నుంచి బైటకు వెళ్లింది. ఇంతలో ఆమె గట్టిగా అరుస్తున్న కేకలు విన్పించాయి. ఆమె తండ్రి లోపల నుంచి బైటకు పరిగెత్తుకుంటు వచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కోతులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఒకప్పుడు పల్లెటూర్లలోనే ఎక్కువగా కోతులు కన్పించేవి. కానీ ఇప్పుడు పట్టణాలలోను ఎక్కువగా కన్పిస్తున్నాయి. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా దాడి చేస్తుంటాయి. పొరపాటున మన చేతిలో ఏదైన తినేపదార్థం తీసుకొని వెళ్తే చాలు.. అవి వెంటపడీ మరీ దాడులకు పాల్పడుతుంటాయి. కొన్నిసార్లు.. అవి ఒకదానిపై మరోకటి కూడా దాడులు చేసుకుంటుంటాయి. అవి చిన్న,పెద్ద తేడా లేకుండా అందరిపైన దాడులు చేస్తుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హత్రాస్ లో కోతులు బాలికపై దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. మరో ఇంటిలోపలికి వెళ్లి దాక్కుంది. కూతురి అరుపులు విని తండ్రి బయటకు వచ్చాడు. అప్పటికే పదుల సంఖ్యలో కోతులు గట్టిగట్టిగా అరుస్తు అతడిని చుట్టుముట్టాయి. అతను కూడా ఏమాత్రం భయపడకుండా కోతుల గుంపులను ఎదుర్కొన్నాడు. వాటిపైన కొట్టడానికి వెళ్లాడు. అక్కడ నుంచి కోతులను తరిమేశాడు.

ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక గండుకోతి అతనిపై దూకి, కిందపడేసింది. దీంతో అతను కింద పడిపోయాడు. వెంటనే తిరిగిలేచి మరల కోతిని అక్కడినుంచి తరిమేశాడు. కాసేపటికి కోతులన్నిఅక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో (video viral) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) తెగ చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఎంత భయంకరంగా దాడిచేస్తుంది..., నిజంగా బాలిక తండ్రికి మెచ్చుకొవాల్సిందే.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా జార్ఖండ్ లోని (Jharkhand)  హజారి బాగ్ లో వింత ఘటన జరిగింది.

స్థానికంగా ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో ఒక కొండెంగ ప్రవేశించింది. అది పిల్లలతా పాటుగా శ్రద్ధగా క్లాస్ లు వింటుంది. అంతే కాకుండా ఎవరిపై కూడా దాడికి పాల్పడటం లేదు. క్లాస్ లోని టీచర్లు, విద్యార్థులు కూడా ఎవరు దాన్ని ఏమనడం లేదు. అంతే కాకుండా.. అతి ఏంచక్కా.. బెంచీ మీద కూర్చుని క్లాసులు వింటూంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media)  పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Monkeys, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు