హోమ్ /వార్తలు /trending /

శోభనం గదిలో వధూవరులు.. అంతలోనే పోలీసుల ఎంట్రీ.. గోడ దూకి భర్త పరార్.. చివర్లో ఊహించని ట్విస్ట్

శోభనం గదిలో వధూవరులు.. అంతలోనే పోలీసుల ఎంట్రీ.. గోడ దూకి భర్త పరార్.. చివర్లో ఊహించని ట్విస్ట్

పెళ్లి చేసుకొని.. శోభనం చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడ వాలిపోయారు. పోలీసులు వచ్చారని తెలియడంతో.. అతడు వధువును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు.

పెళ్లి చేసుకొని.. శోభనం చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడ వాలిపోయారు. పోలీసులు వచ్చారని తెలియడంతో.. అతడు వధువును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు.

పెళ్లి చేసుకొని.. శోభనం చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడ వాలిపోయారు. పోలీసులు వచ్చారని తెలియడంతో.. అతడు వధువును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు.

  పెళ్లి ఘనంగా జరిగింది. బంధు మిత్రుల సందడి మధ్యూ ధూమ్ ధామ్‌గా ముగిసింది. ఆ తర్వాత కొత్త జంట తొలిరాత్రి. వధూవరులు శోభనం గదిలో ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఎంట్రీతో ఊహించని పరిణామం జరిగింది. పోలీసులను చూసి వరుడు పారిపోయాడు. వధువును అక్కడే వదిలి.. గోడదూకి పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శోభనం జరుగుతున్న వేళ పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది..? వారిని చూసి వరుడు ఎందుకు పారిపోయాడు..? అసలు అతడేం తప్పు చేశాడు?

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... రాంపూర్ జిల్లా సైద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై ఇటీవల రేప్ కేసు నమోదయింది. పల్లెటూరి అమ్మాయిని ప్రేమించిన అతడు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శారీరక సంబంధం పెట్టుకొని.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి, తన బంధువులతో కలిసి మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కట్ చేస్తే.. వారికి అతడికి గురించి ఓ సమాచారం అందింది. పెళ్లి చేసుకొని.. శోభనం చేసుకుంటున్నట్లు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే అక్కడ వాలిపోయారు. పోలీసులు వచ్చారని తెలియడంతో.. అతడు వధువును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. గోడ దూకి జంప్ అయ్యాడు.

  Viral News:ఆమెకు సిక్స్టీ ప్లస్..అతనికి ట్వంటీ ప్లస్..పెళ్లైంది ఇక అందుకోసమే వెయిటింగ్..

  ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు. మూడు రోజుల క్రితం కేసు పెట్టిన అమ్మాయే. ఆమెతోనే శోభనం జరగాల్సి ఉంది. కానీ అంతలోనే పోలీసులు రావడంతో... అందరూ షాక్ అయ్యారు. ఐతే ప్రేమించిన అమ్మాయినే.. పెళ్లి చేసుకున్నాడు కదా.. మరి పోలీసులు ఎందుకొచ్చారు? అని అనుకోవచ్చు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంత వరకే పోలీసులకు తెలుసు. కానీ ఆ తర్వాత వారికి తెలియకుండా చాలా జరిగింది. కేసు పెట్టిందని తెలియడంతో.. పెద్ద మనషులు కలగజేసుకొని.. పంచాయతీ పెట్టారు. ఇరు కుటుంబాాలకు నచ్చజెప్పి.. ఇద్దరికీ పెళ్లి చేశారు. ఐతే ఈ పెళ్లి గురించి మాత్రం పోలీసులకు చెప్పలేదు.

  Video Viral: ఆక్కడ చీకటి పడితే ఒంటరిగా రోడ్డుపై వెళ్లే వాళ్ల పరిస్థితి అంతే సంగతులు

  అప్పటికే నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయికి అన్యాయం చేసిన ప్రియుడిని పట్టుకునేందుకు వెతుకుతున్నారు. ఐతే అతడికి పెళ్లి జరిగిందని ఆలస్యంగా తెలిసి షాక్ తిన్నారు. వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడేమోనని అనుకున్నారు. కానీ తనపై కేసు పెట్టిన ప్రియురాలినే పెళ్లి చేసుకున్నాడని... అతడు శోభనం గది నుంచి పారిపోయాక తెలిసింది. ఐనప్పటికీ నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆ యువతి కేసు వాపసు తీసుకుంటేనే.. అతడిపై నమోదైన కొట్టివేస్తామని స్పష్టం చేశారు. లేదంటే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. చివరకు మళ్లీ ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వాపసు తీసుకోవడంతో.. ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది.

  First published:

  ఉత్తమ కథలు