పేద ప్రజల కోసం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్దుల కోసం పాలకులు ఎన్నో సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి అవి అమలు చేయడానికి వచ్చే సరికి విమర్శలు ఎదుర్కొవల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో స్కూల్ టీచర్లు, సిబ్బంది చిత్తశుద్ధి లోపించడంతో చివరకు విద్యార్ధులే తాము తినాల్సిన ఆహారం కోసం పని వాళ్లుగా మారాల్సిన దుస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఘాజీపూర్Ghazipurలోని కరంద బ్లాక్‌లోని బార్వా ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా(Social media) ద్వారా దేశ వ్యాప్తంగా వైరల్ (Viral)అవుతున్నాయి. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు విద్యార్ధుల్ని పని వాళ్లుగా మార్చేశాడు. చిట్టి చేతులతో కట్టెలు మోయించారు.
పాఠాలకు బదులు పని చెప్పిన టీచర్లు...
ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులతో కట్టెలు మోయించారు ఉపాధ్యాయులు. ఈవార్త ఇప్పుడు సంచలనంగా మారింది. స్కూల్‌లో ప్రతి రోజూ విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజనం వడ్డించే వంటశాలలో గ్యాస్ అయిపోవడంతో విద్యార్ధులను స్కూల్ సమీపంలో ఉన్న కట్టెలు ఏరుకొని తీసుకురమ్మని పంపించారు. దీంతో మధ్యాహ్నం వరకు పాఠాలు విన్న స్టూడెంట్స్ యూనిఫామ్‌లోనే రోడ్డు పక్కన ఉన్న కట్టెలు ఏరుకొని స్కూల్‌కు తీసుకెళ్లడం స్థానికులు చూశారు. విద్యార్ధులతో ఇలాంటి వెట్టి చాకిరి చేయించింది ఎవరో కాదు కరంద బ్లాక్‌లోని బార్వా ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పే టీచర్లు కావడంతో వార్త వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ..
పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన ప్రైమరీ సెక్షన్ స్కూల్ పిల్లలతో రోడ్లపై ఎండలో కట్టెలు మోయించిన సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం చాలా తప్పని ..ఎందుకు ఎలా చేశారో వివరణ ఇవ్వాలని ఆ స్కూల్ టీచర్లు, స్టాఫ్‌ని వివరణ కోరామని..పూర్తి వివరాలు అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, డీఈవో సమాధానం ఇచ్చారు.
ఉన్నతాధికారుల రియాక్షన్..
మరోవైపు ఈసంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండటానికి గ్యాస్, కిరోసిన్ లేదని పిల్లలతో కట్టెలు మోయిస్తారా ..ఒకవేళ బియ్యం లేకపోతే ఏం చేస్తారు అందుకోసం వేరే దగ్గర పనికి పంపుతారా అంటూ విమర్శలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video