హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: మురుగులో పారుతున్న బంగారం.. 100కు పైగా కుటుంబాల వెతుకులాట.. ఎక్కడంటే..

OMG: మురుగులో పారుతున్న బంగారం.. 100కు పైగా కుటుంబాల వెతుకులాట.. ఎక్కడంటే..

మురుగును శుభ్రం చేస్తున్న మహిళ

మురుగును శుభ్రం చేస్తున్న మహిళ

Uttar Pradesh: అక్కడ ప్రతిరోజు వందల కుటుంబాలు మురుగు నీటిలో దిగుతారు. అక్కడ ప్రత్యేకంగా ఒక బేసిన్ లాంటి దానిలో మురుగులోని వ్యర్థాలను సేకరిస్తారు.

  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India

మనం కొన్ని చోట్ల మురుగులో దిగి చెత్తను గానీ వ్యర్థాలను గానీ వెతికే వారిని తరచుగా చూస్తునే ఉంటాం. అయితే.. మెయిన్ గా బంగార దుకాణాలు ఉండే చోట కొందరు అక్కడ ఉండే కాల్వలలో దిగుతుంటారు. బంగారు దుకాణాలలో ఊడ్చిన తర్వాత చెత్తను దగ్గరలోని కాల్వలోనికి వేస్తుంటారు. కొందరు ఆ మురుగులోనికి దిగి బేసిన్ సహయంతో అనేక సార్లు వ్యర్థాలను శుభ్రం చేస్తారు. అక్కడ ఆ రేణువులలో చిన్న బంగారు కణాలను వారు సేకరిస్తారు. వాటిని తిరిగి శుభ్రం చేసి, ఇతర బంగారు దుకాణాలలో అమ్మి సొమ్ముచేసుకుంటారు. ఇలా చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు...ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) గోరఖ్ పూర్ లో వందలాది కుటుంబాలు మురుగు నీటి నుంచి ప్రతిరోజు బంగారం కణాలను సేకరిస్తుంటారు. అక్కడ అనేక విధాలుగా శుభ్రం చేస్తారు. వీరు ప్రధానంగా.. ఘంటాఘర్ లో ఉన్న సోనార్ పట్టీ లో ఎక్కువగా ఉంటున్నారు. దాదాపు వందలాది కుటుంబాలు ఇలా కాలువల నుంచి చేత్తను సేకరించి జీవిస్తుంటారు. వీరిని నిహారీలు అని అంటారు.

ఇలా దాదాపు వందకు పైగా కుటుంబాలు ఈ పనిచేస్తుంటాయి. ఈ విధంగా వ్యర్థాలలోని కణాలను సేకరించి వాటిని శుభ్రం చేసి, బంగారం దుకాణాలలో విక్రయిస్తుంటారు. దీనితో వీరు కుటుంబాన్ని పోషించుకుంటారు. కాగా, నాగ్ పూర్, ఝాన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన బంజారాలు ఈ పనిచేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తమాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First published:

Tags: Gold, Trending, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు