హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇంద్రుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు.. పైఅధికారులకు ఫార్వర్డ్ చేసిన అధికారి.. ఆ తర్వాత..

ఇంద్రుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు.. పైఅధికారులకు ఫార్వర్డ్ చేసిన అధికారి.. ఆ తర్వాత..

ఇంద్రుడిపైన  ఫిర్యాదు

ఇంద్రుడిపైన ఫిర్యాదు

Uttar pradesh: కొన్ని నెలలుగా వర్షం అసలు పడట్లేదు. దీంతో రైతు వేసిన పంటలన్ని ఎండిపోయాయి. ఏ ఒక్క పంట కూడా అతని చేతికి రాలేదు. ఈ క్రమంలో రైతు చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది.

కొన్ని చోట్ల కుండపోతగా వర్షం (Heavy rain)  కురుస్తోంది. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లుగా భీకరమైన వడగళ్లు పడుతున్నాయి.దీంతో నదులు, చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో నిండిపోయారు. కొన్ని చోట్ల నదులు గ్రామాలలోనికి వచ్చేశాయి. ప్రజల ఇళ్లలోనికి నీళ్లు వచ్చి చేరాయి. కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే.. మరికొన్ని చోట్ల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ అసలు చుక్క కూడా వర్షం లేక రైతులు , సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే... ఈ క్రమంలో రైతు చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh) వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని నెలలుగా అసలు వర్షం పడట్లేదు. దీంతో.. గోండా జిల్లాకు చెందిన ఓ రైతు వానదేవుడైన ఇంద్రుడిపై రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వర్షం కురవని కారణంగా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ ఫైల్ చేశాడు. గ్రామంలో జరిగే.. ఝాలా గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్‌గా గుర్తించబడిన రైతు, “సమాధాన్ దివాస్” (ఫిర్యాదు పరిష్కార దినం) సందర్భంగా వింత ఫిర్యాదును సమర్పించారు. సంపూర్ణ సమాధాన్ దివస్ – సంపూర్ణ పరిష్కార దినం – శనివారం గోండా జిల్లాలో జరిగింది.

జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు, అనావృష్టి గురించి లార్డ్ ఇంద్రుడిని నిందిస్తూ, సుమిత్ కుమార్ యాదవ్ ఇలా వ్రాశాడు, “ఈ ఫిర్యాదుతో, ఫిర్యాదుదారుడు గత చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను.

కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా అధికారులను కోరాడు. ఇంతలో, ఎన్ ఎన్ వర్మ అనే రెవెన్యూ అధికారి ఫిర్యాదు లేఖపై “వాన దేవుడు”పై చర్య తీసుకోవాలని సిఫార్సు చేశారు. స్పష్టంగా, అతను ఈ లేఖను చదవకుండానే తదుపరి చర్య కోసం DM కార్యాలయానికి పంపాడు.

ఈ లేఖ వైరల్ (Viral)  కావడంతో వర్మ దానిని ఫార్వార్డ్ చేయలేదని కొట్టిపారేశాడు. “అలాంటి విషయం నాకు రాలేదు. ఆ ఫిర్యాదు లేఖపై కనిపించే ముద్ర నకిలీ ముద్ర. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేయబడతాయి మరియు ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపబడవు. కాబట్టి, ఈ మొత్తం కల్పితమని అన్నాడు. కాగా, దీనిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ జరుపుతామని వర్మ తెలిపారు. అయితే, లేఖలో అధికారి సంతకం, తదుపరి చర్య కోసం ఫార్వార్డ్ చేయబడిందని వ్రాసిన కామెంట్ ఉంది.

First published:

Tags: Rains, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు