హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

స్టేషన్ ఆవరణలో రెచ్చిపోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్..

స్టేషన్ ఆవరణలో రెచ్చిపోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్..

బాధితుడిని కొట్టిన పోలీసు

బాధితుడిని కొట్టిన పోలీసు

Uttar Pradesh: తన మేనకోడలు కొన్నిరోజులుగా కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొంత మంది పోలీసులు తమ అధికారాలు దుర్వినియోగం చేస్తుంటారు. పోలీసు ఉద్యోగం రాగానే.. సామాన్యులపై తమ జూలుం ప్రదర్శిస్తుంటారు. ఇష్టమోచ్చినట్లు అజమాయిషీ చేస్తుంటారు. ఇంకొందరు.. తమ అధికారాలను దుర్వినియోగంచేస్తుంటారు. మరికొందరు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైన నోటికొచ్చినట్లు తిడుతుంటారు. అఘాయిత్యాలకు పాల్పడి వేధిస్తుంటారు. భౌతికదాడులు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. బాగ్ పత్ లోని బినౌలీ సమీపంలోని బాల్ వీర్ అనే వ్యక్తి తన మేనకోడలు గత నాలుగు రోజుల నుంచి కన్పించడం లేదని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. కానీ అధికారులు మాత్రం అతని ఫిర్యాదు తీసుకొలేదు. కనీసం పట్టించుకునే పాపన పోలేదు. అయితే.. అతగాడు పోలీస్ స్టేషన్ చుట్టు,అధికారులను కలుస్తూ ప్రాధేయ పడుతున్నాడు. ఈ క్రమంలో.. అతగాడు అందరు అధికారు ముందే బినౌలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ఉన్న ఇన్‌స్పెక్టర్ బిర్జా రామ్ ను కలిశాడు. తన ఫిర్యాదు తీసుకొవాలని కోరాడు.

దీంతో రెచ్చిపోయిన బిర్జారామ్ నోటికొచ్చినట్లు దుర్భాషాలాడుతూ.. బాధితుడిని లాగిపెట్టి కొట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ నానా బూతులు తిట్టాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video)  మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ బిర్జా రామ్ ను పోలీస్ లైన్ కు అటాచ్ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Police, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు