నేరం చేసినట్లుగా రుజువైతే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే. అయితే అది కేవలం మనుషులకే కాదు ...మూగ జీవాలకు కూడా వర్తిస్తుందని నిరూపించారు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)అధికారులు. అదేంటి ఇదెక్కడి న్యాయం అని ఆశ్చర్యపోకండి..యూపీలోని కాన్పూర్(Kanpur)లో ఓ కోతి ఇప్పుడు అలాంటి జైలు శిక్షే అనుభవిస్తోంది. తోక ఉంది కదా అని ప్రతి వారిపై గంతులేసి దాడి చేసింది. కోతి (Monkey)చేష్టలు ప్రమాదకరంగా మారడంతో ఫారెస్ట్(Forest)అధికారులు ఆ వానరాన్నిజూలో పెట్టి బంధించారు. జీవిత ఖైదు అమలు చేస్తున్నారు. వింటానికే విడ్డూరంగా ఉన్న ఈస్టోరీ(Story)లో కోతి చేసిన నేరం ఏమిటి..? ఎందుకలా ప్రవర్తించింది అనే డౌట్స్‌కి అధికారులు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు.
ఐదేళ్లు జైలు శిక్ష పడినా మారలేదు..
మనిషికైనా, జంతువులకైనా నేరం చేస్తే ఒకే శిక్ష అంటున్నారు ఉత్తరప్రదేశ్‌లోని ఫారెస్ట్ అధికారులు. ఐదేళ్ల క్రితం యూపీలోని మీర్జాపుర్‌లో ఓ మాంత్రికుడి దగ్గర ఉంటున్న కాలియా అనే కోతి కోరి మరీ కష్టాల్ని కొని తెచ్చుకుంది. తాంత్రికుడు తాను మద్యం సేవిస్తూ కోతికి కూడా అలవాటు చేశాడు. దీంతో మద్యానికి బానిసైన వానరం 2017లో తాంత్రికుడు చనిపోయిన తర్వాత మద్యం తాగించే వాళ్లు లేకపోవడంతో మద్యం కోసం రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఈవిధంగా 250మందిని గాయపర్చింది. అంతే కాదు మద్యం తాగేందుకు మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లి అక్కడ ఆల్కహాల్ సేవిస్తున్న వారి చేతిలో సీసాలు, గ్లాసులు లాక్కొని పారిపోయేది.
మారని కోతి తీరు..
కోతి చేష్టలను భరించలేకపోయిన స్థానికులు, మద్యం షాపు యజమానులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కోతిని అతికష్టం మీద బంధించారు. మద్యం తాగుతూ జనంపై దాడి చేస్తోందని కాన్పూర్ జూలో బంధించారు. కోతిని మానసీక వైద్యుడికి చూపిస్తూ ట్రీట్మెంట్ చేయించారు.
జీవితమంతా బంధీఖానానే..
ఐదేళ్లు గడిచినప్పటికి కాలియా అనే కోతి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఫారెస్ట్ అధికారులు, జంతు మానసీక వైద్యులు జీవితాంతం జూలోనే బంధీగా ఉంచాలని సూచించారు. దీంతో హాయిగా చెట్లపై గెంతుతూ ..పండ్లు, ఫలాలు తినాల్సిన కోతి ..జూలో ఒంటరిగా బంధీఖాన జీవితాన్ని అనుభవిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttarapradesh, VIRAL NEWS