Home /News /trending /

UTTAR PRADESH ANGRY POLITICAL LEADER BITES OFF MINOR HELPS NOSE OVER TRIVIAL ISSUE VICTIM ADMITTED TO HOSPITAL PAH

Shocking: కోపంతో బాలుడి ముక్కుకొరికేసిన పొలిటిషియన్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: ఇంట్లో పనిచేసే బాలుడిపై పొలిటిషియన్ తన ప్రతాపాన్ని చూపించాడు. కోపంతో అతను చేసిన పనికి కంట్రోల్ తప్పాడు. ఆ తర్వాత.. బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
కొంత మంది ప్రతిచిన్న విషయాలకు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారిమీద, అమాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. మరికొందరు ఇంట్లో సహాయం చేయడానికి మనుషులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న పెద్ద పొరపాటుకు.. గయ్ గయ్ అంటూ అరుస్తుంటారు. తమ కోపాన్ని వారి మీద తీర్చుకుంటారు. కొందరు ఇంట్లో భార్యలపైన, పనివారి మీద, పిల్లలమీద చూపిస్తుంటారు. మరికొందరు ఆఫీస్ లలో తోటి ఉద్యోగులపై కూడా చూపిస్తుంటారు. కొన్నిసార్లు.. కంట్రోల్ తప్పి వాగ్వాదానికి దిగుతుంటారు. అదే విధంగా.. భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది. లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.



అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉండగా ఒక చిన్న పిల్లాడి పట్ల తల్లి చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఇంగ్లండ్‌లోని (England) కెంట్‌లోని డోవర్‌లో జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. తల్లిదండ్రుల తమ బిడ్డకు వోడ్కా తాగిస్తున్న ఘటన నెట్టింట వైరల్ గా మారింది. కన్న వాళ్లే బిడ్డ పక్కన కూర్చుని మరీ వోడ్కా తాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనను రికార్డు చేసి, సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో సీరియస్ అయిన.. పోలీసులు చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదుచేశారు. వోడ్కా ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ షూట్ చేసినట్లు నిందితులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ లు వైరల్ గా మారాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS

తదుపరి వార్తలు