హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అమానుషం.. నిండు గర్భిణిని రోడ్డుమీద వదిలేసిన అంబూలెన్స్ డ్రైవర్.. ఎందుకంటే..

అమానుషం.. నిండు గర్భిణిని రోడ్డుమీద వదిలేసిన అంబూలెన్స్ డ్రైవర్.. ఎందుకంటే..

రోడ్డుపక్కన కూర్చున నిండు గర్భిణి

రోడ్డుపక్కన కూర్చున నిండు గర్భిణి

Uttar Pradesh: మహిళకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అంబూలెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబూలెన్స్ సిబ్బంది, మహిళను ఎక్కించుకుని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొందరు అంబూలెన్స్ సిబ్బంది కాసుల కోసం ఎంతకైన తెగిస్తుంటారు. అవతల రోగి చావుబతుకుల మధ్య ఉన్నాడా.. మరేదైన సమస్యల్లో ఉన్నాడా అన్నది ఏమాత్రం పట్టించుకోరు. డబ్బుల కోసం రోగి బంధువులు పీక్కు తింటుంటారు. ఒక సిండికెట్ మాదిరిగా ఏర్పడి అమాయకులను దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో.. అంబూలెన్స్ జనాలను పీడించుకుని తింటున్న అనేక సంఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత.. వీరి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పటికే అంబూలెన్స్ డ్రైవర్ ల దారుణాలకు సంబంధించిన ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  దారుణమైన ఘటన సంభవించింది. హమీర్‌పూర్‌లోని పండరి గ్రామంలో ఒక మహిళ పురిటి నొప్పులతో విలవిల్లాడిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు అంబూలెన్స్ కు కాల్ చేశారు. మహిళను ఎక్కించుకుని, కొంత దూరం వెళ్లాక డ్రైవర్ వ్యాన్ ఆపాడు. మహిళ దగ్గరకు వచ్చివెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పాపాం.. మహిళ తరపు వారు అంతడబ్బులు తమ వద్ద లేవనడంతో కోపంతో వాళ్లను నోటికొచ్చినట్లు తిట్టాడు. ఆ తర్వాత.. వారిని నడిరోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయాడు.


దీంతో మహిళ, ఆమె బంధువులు రోడ్డుమీదనే ఉండిపోయారు. ఈ ఘటనను అక్కడ ఉన్న వారంతా వీడియో తీశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ స్థానిక పోలీసులకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా ఇటీవల కెనడా(Canada)కు చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజర్(Farah Nasser) లైవ్ బులిటెన్ చదువుతోంది.

పాకిస్తాన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత అవస్త పడుతున్నారో.. వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో ఫరా నాసర్ లైవ్ లో వివరిస్తున్నారు" పాకిస్తాన్ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రుతుపవనాలను చూడలేదు. అక్కడ 8 వారాలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు"అని ఫరా వార్తలు చదువుతుండగా అకస్మాత్తుగా ఒక ఈగ గుయ్ గుయ్ మంటూ ఎగురుతూ వచ్చి ఆమె నోటిలోకి ప్రవేశించింది.

ఆ సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో ఫరా నాజర్ ఏకంగా ఆ ఈగను మింగేసింది(Female Anchor Swallowed a Fly On Air Video). న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు. ఈగను మింగి గొంతు సవరించుకుని ఫరా మళ్ళీ వార్తలు చదవడం ప్రారంభించింది.దీనికి సంబంధించిన వీడియోని ఫరా నాజర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "ఈ రోజుల్లో మనమందరం నవ్వాల్సిన అవసరం ఉన్నందున నేను ఈ వీడియోను భాగస్వామ్యం చేస్తున్నాను.ఈ రోజు గాలిలో నేను ఈగను మింగాను"అని పేర్కొంటూ ఆ వీడియోని ఫరా నాజర్ షేర్ చేయగా అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.

First published:

Tags: Corruption, Free ambulance, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు