హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అద్భుతం.. 7 నిమిషాలపాటు నవజాత శిశువుకు సీపీఆర్.. వీడియో వైరల్..

అద్భుతం.. 7 నిమిషాలపాటు నవజాత శిశువుకు సీపీఆర్.. వీడియో వైరల్..

శిశువుకు సీపీఆర్ చేస్తున్న లేడీ డాక్టర్

శిశువుకు సీపీఆర్ చేస్తున్న లేడీ డాక్టర్

Uttar Pradesh:  కనీసం శ్వాస తీసుకొవడానికి కూడా నవజాత శిశువు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న లేడీ డాక్టర్ సీపీఆర్ చేసి శ్వాసను అందించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొన్ని సార్లు మనం ఏదైన ప్రమాదాల బారిన పడినప్పుడు శ్వాసను తీసుకొవడంలో తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటాం. అలాంటి సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి పీల్చుకొవడానికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో డాక్టర్ లు, పక్కనున్న వారు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్ ) చేస్తే బాధితుడు బతికే అవకాశం నిరూపించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన మరో వీడియో నెట్టింట్లో (Social media) వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) ఆగ్రాలో అనుకొని సంఘటన సంభవించింది. ఆగ్రాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒక ఆడ శిశువు జన్మించింది. అయితే.. శిశువు శ్వాస తీసుకొలేకపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మహిళా డాక్టర్ సులేఖా చౌదరీ వెంటనే శిశుకు 7 నిముషాల పాటు సీపీఆర్ ద్వారా శ్వాసను అందచేసింది. డాక్టర్ తన నోటితో శిశువుకు శ్వాసను అందజేసింది. దీంతో కాసేపటికి శిశువు ఊపిరి పీల్చుకుంది. వెంటనే శిశువు ఏడుపును ప్రారంభించింది.

దీంతో అక్కడున్న వారంతా సంతోషంతో డాక్టర్ ను అభినందించారు. తమకు దక్కదనుకున్న శిశువు తిరిగి దక్కడంటే శిశువు తల్లిదండ్రులు ఆనందంతో లేడీ డాక్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయత్నం తాను చేశానని లేడీ డాక్టర్ సులేఖ చౌదరీ తెలిపారు. ఈ ఘటన మార్చి 2022 లో జరిగింది. కాగా, దీన్ని తాజాగా, సచిన్ కౌశిక్ అనే పోలీసు అధికారి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మరోమారు వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు