Health Tips: టీ బ్యాగ్‌ వాడుతున్నారా... ? 1100 కోట్ల ప్లాస్టిక్ మూలకాలు తాగినట్లే

ఒక టీ బ్యాగ్‌ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని గుర్తించారు.

news18-telugu
Updated: September 28, 2019, 12:45 PM IST
Health Tips: టీ బ్యాగ్‌ వాడుతున్నారా... ? 1100 కోట్ల ప్లాస్టిక్ మూలకాలు తాగినట్లే
నమూనాచిత్రం
  • Share this:
సాధారణంగా చాలామంది పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. టీ తాగదానిదే ఏ పని మొదలుపెట్టలేరు. అయితే మనం ఇంట్లో చక్కగా మనకు నచ్చిన టీ పొడి వేసుకొని టీ తాగితే పర్వాలేదు. కానీ... బయట అందుబాటులో దొరుకుతున్నాయి కదా అని... కాఫీ లేదా టీ , గ్రీన్ టీ పొడిలకు సంబంధించిన టీబ్యాగులు ఇంటికి తెచ్చుకున్నారా? ఇక అంతే సంగతులు. మీరు జబ్బుల్ని... అనారోగ్యాన్ని కోరి కొనుక్కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు.  కాఫీ, టీ లేదా గ్రీన్ టీ... వంటివి త్వరగా అవుతాయని చెప్పి పొడికి బదులుగా వాటి బ్యాగులను వాడుతున్నవారు తస్మాత్ జాగ్రత్త.. అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఎందుకంటే సదరు కాఫీ లేదా టీ బ్యాగ్స్ మన శరీరానికి హాని కలిగిస్తాయని ఇటీవలే జరిగిన పరిశోధనల్లో తేలింది. పలువురు సైంటిస్టులు చేసిన ప్రయోగాల్ ఒక టీ బ్యాగ్‌ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని గుర్తించారు.  మనం మామూలుగా అయితే టీబ్యాగ్‌తో తయారైన టీంలో వీటిని చూడలేం. కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా పరిశోధకులు వీటిని తాజాగా గుర్తించారు. అందుకే మార్కెట్‌లో మనకు దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, పొడిని మాత్రమే వాడాలని వారు చెబుతున్నారు.ఈ పరిశోధనలకు సంబంధించిన తాజా వివరాల్ని ఈ నెలలో అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించింది.


కాఫీ, టీ బ్యాగులను నైలాన్, పీవీసీ, ఎపిక్లోరోపైడ్రిన్, థర్మో ప్లాస్టిక్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ క్రమంలో సదరు బ్యాగులను వేడి వేడి పాలు, లేదా నీటిలో ముంచినప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి ఆ ద్రవంలో కలుస్తాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కార్సినోజెన్ల జాబితాకు చెందుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కార్సినోజెన్లు అంటే క్యాన్సర్ కారకాలే. అవి క్యాన్సర్ వ్యాధులను కలగజేస్తాయి. కనుక కాఫీ లేదా టీ ఏదైనా బ్యాగులను కాక పొడి రూపంలో వాటిని వాడాలని వారు హెచ్చరిస్తున్నారు.



టీ బ్యాగ్‌తో పొట్టలోకి ప్లాస్టిక్ మూలకాలు’( ఇమేజ్ P. D. Mangan
ట్విట్టర్ )
Loading...
ఇవికూడా చదవండి: 

Health Tips : మంచి వంట నూనె ఏది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Weight Loss : బరువు తగ్గాలంటే... ఈ 10 ఆహారాలూ రాత్రివేళ తినవద్దు
First published: September 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...